Hyderabad: హాట్ సమ్మర్.. కూల్ బిజినెస్
ABN , Publish Date - Apr 25 , 2025 | 10:41 AM
ప్రస్తుతం వేసివి సీజనే వచ్చేసింది. ఓ పక్క ఎండలు మండిపోతున్నాయి. అలాగే పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు నమోదవుతున్నాయి. అయితే.. నగరంలోని ఆయి ప్రధాన రహదారుల వెంట జ్యూస్ సెంటర్లు వెలుస్తున్నాయి. ప్రధానంగా లస్సీ, నిమ్మరసాల సెంటర్లకు గిరాకీ బాగా పెరిగింది.

- జ్యూస్ సెంటర్లు.. ఐస్‌క్రీం పార్లర్లకు పెరిగిన గిరాకీ
- కొబ్బరిబొండాలు, నిమ్మకాయ సోడాకు డిమాండ్
- ఎండ నుంచి ఉపశమనం పొందుతున్న జనం
హైదరాబాద్: నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు నమోదవుతున్నాయి. మున్ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వేసవి తాపం నుంచి చల్లబడేందుకు నగర ప్రజలు పండ్ల రసాలు, శీతల పానియాలు, ఐస్‌క్రీం పార్లర్లను ఆశ్రయిస్తుండడంతో చల్లని వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. చీకటి పడినా భానుడి భగభగ తగ్గకపోవడంతో పొద్దుపోయే వరకు గిరాకీలు అవుతున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రూ.1.22కోట్ల ట్రేడింగ్ మోసం..
జ్యూస్ సెంటర్లకు పెరిగిన డిమాండ్
కూకట్‌పల్లిలో జ్యూస్ సెంబర్లు జోరుగా సాగుతున్నాయి. కూల్‌డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం అంటూ పలువురు వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతుండడం, సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం వైరల్ కావడంతో ప్రజలు పండ్ల రసాల వైపు మొగ్గు చూపుతున్నారు. కూకట్‌పల్లిలో కొబ్బరిబొండాలు, చెరుకు బండ్లు, జ్యూస్ సెంటర్లు, ఐస్‌క్రీం పార్లర్లు జనంతో రద్దీగా కనిపిస్తున్నాయి.
పెరిగిన విక్రయాలు
గతేడాదితో పోలిస్తే ఈసారి కొబ్బరి బొండాల విక్రయాలు పెరిగాయి. ఒక్కో కొబ్బరిబొండా రూ.40 నుంచి రూ.50 వరకు అమ్ముతున్నాం. లీటర్ రూ.120 వరకు అమ్ముతున్నాం. ఆంధ్రప్రదేశ్, బెంగళూరు ప్రాంతాల నుంచి కొబ్బరిబొండాలను తీసుకువస్తున్నాం.
- వెంకటేశ్, కూకట్‌పల్లి
కొబ్బరి బొండాలపై మక్కువ
భానుడి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఎక్కువగా కొబ్బరిబొండాల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. కూకట్‌పల్లిలోని ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లలో, పలుకాలనీలో కొబ్బరిబొండాల విక్రయం జోరుగా కొనసాగుతోంది. ఎండ తీవ్రతకు శరీరం వేడెక్కి దాహం వేస్తోంది. కొబ్బరినీళ్లు తాగడం ద్వారా అందులోని ఖనిజాలు, విటమిన్లు శరీరానికి వేడిని తగ్గించి చల్లదనాన్ని అందిస్తాయి. వైద్యులు కూడా వేసవిలో కొబ్బరిబొండా తాగడం ఉత్తమమని చెబుతున్నారు. అందుచేత ఎక్కువగా కొబ్బరిబొండాలపై మక్కువ చూపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
దేశ భద్రతపై కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు
పంచాయతీలకు ఎన్నికల్లేవు.. అభివృద్ధికి నిధుల్లేవు!
కౌశిక్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట
పర్యాటకుల మతం అడిగి పాశవికంగా కాల్చారు
Read Latest Telangana News and National News