Share News

High Court: సీఎంపై వ్యాఖ్యలు..కేటీఆర్‌పై కేసును కొట్టేసిన హైకోర్టు

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:43 AM

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసును సోమవారం హైకోర్టు కొట్టివేసింది.

High Court: సీఎంపై వ్యాఖ్యలు..కేటీఆర్‌పై కేసును కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసును సోమవారం హైకోర్టు కొట్టివేసింది. లోక్‌సభ ఎన్నికల ఖర్చు కోసం కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి రూ.2,500 కోట్లు వసూలు చేసిన రేవంత్‌రెడ్డి వాటిని ఢిల్లీలోని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి పంపించారని కేటీఆర్‌ ఆరోపించారు. అవమానించడం, విద్వేషాలు రెచ్చగొట్టే దురుద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ నాయకుడు బత్తిని శ్రీనివాసరావు బంజరాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం.. చేసిన విమర్శలకు పెట్టిన సెక్షన్లకు పొంతనేలదని పేర్కొంటూ కేసును కొట్టేసింది.


జిమ్‌లో కేటీఆర్‌కు గాయం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గాయపడ్డారు. తన వెన్నెముకకు దెబ్బ తగిలిందని సోమవారం ఎక్స్‌ వేదికగా ఆయన తెలిపారు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని చెప్పారు. కాగా, కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఏపీ డిప్యుటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు.

Updated Date - Apr 29 , 2025 | 04:43 AM