TSPSC Group 1: గ్రూప్ 1 అభ్యర్థులకు హైకోర్టు షాక్..
ABN , Publish Date - Apr 17 , 2025 | 06:50 PM
TSPSC Group 1: తెలంగాణ గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికై.. నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు షాకింగ్ న్యూస్ ఇది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ విషయంలో రాష్ట్ర హైకోర్టు సంచలనం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలంగాణ గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికై.. నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు షాకింగ్ న్యూస్ ఇది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ విషయంలో రాష్ట్ర హైకోర్టు సంచలనం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర హైకోర్టు బ్రేక్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్ 1 నియామక పత్రాలు ఇవ్వొద్దని స్పష్టం చేసింది. అయితే, ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్స్ వేరిఫికేషన్ కొనసాగించవచ్చునని హైకోర్టు తెలిపింది. దీంతో గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.
Also Read:
అలర్ట్! ఆఫీసుల్లో ఉద్యోగులు ఈ 8 మిస్టేక్స్ చేస్తే
భారత్-చైనా కొత్త ఒప్పందం..కైలాష్ యాత్రకు
కాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..
For More Telangana News and Telugu News..