Heavy Rains: దంచికొట్టిన వాన.. రహదారులు జలమయం
ABN , Publish Date - Jul 26 , 2025 | 08:23 AM
నగరంలో శుక్రవారం ఉదయం నుంచీ చిరుజల్లులు పడుతుండగా, రాత్రి గంటపాటు దంచికొట్టింది. 8.30 తర్వాత గంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, మెహిదీపట్నం, లంగర్‌హౌస్, షేక్‌పేట, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ జాం సమస్యలు తలెత్తాయి.

- ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ సిటీ: నగరంలో శుక్రవారం ఉదయం నుంచీ చిరుజల్లులు పడుతుండగా, రాత్రి గంటపాటు దంచికొట్టింది. 8.30 తర్వాత గంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్(Banjara Hills, Jubilee Hills, Khairatabad), పంజాగుట్ట, మెహిదీపట్నం, లంగర్‌హౌస్, షేక్‌పేట, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ జాం సమస్యలు తలెత్తాయి.
రాత్రి 10 గంటల వరకు యూసుఫ్‌గూడ, గోల్కొండలలో 2.5సెం.మీల వర్షపాతం నమోదైంది. బోరబండ, హైటెక్‌సిటీ, ఖైరతాబాద్, మారేడ్‌పల్లి, ఉప్పల్, షేక్‌పేట(Maredpally, Uppal, Sheikhpet), ముషీరాబాద్, సికింద్రాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రహదారులు జలమయంగా మారడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మ్యాన్‌హోళ్లు పొంగి మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. కాగా, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాలకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు చేరుతుండడంతో వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి జలాశయాలను అధికారులతో కలిసి సందర్శించారు. పరీవాహక ప్రాంతాలలో గస్తీ పెంచాలని, సీసీ కెమెరాలతో నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
యాదగిరిగుట్ట సత్యదేవుడి వ్రత టికెట్ ధర పెంపు
Read Latest Telangana News and National News