GHMC: రూ.5కే ఇడ్లీ, పూరి, ఉప్మా..
ABN , Publish Date - Jul 10 , 2025 | 07:43 AM
ఇందిరమ్మ క్యాంటీన్లలో అల్పాహారం అందించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. హరే కృష్ణ మూవ్‌మెంట్ భాగస్వామ్యంతో గ్రేటర్‌లోని 150 కేంద్రాల్లో త్వరలో అల్పాహారం(టిఫిన్) అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందిరమ్మ క్యాంటీన్లలో అల్పాహారం
ఏటా రూ.15.33 కోట్లు ఖర్చవుతుందని అంచనా
హైదరాబాద్ సిటీ: ఇందిరమ్మ క్యాంటీన్ల(Indiramma Canteens)లో అల్పాహారం అందించాలని జీహెచ్‌ఎంసీ(GHMC) నిర్ణయించింది. హరే కృష్ణ మూవ్‌మెంట్ భాగస్వామ్యంతో గ్రేటర్‌లోని 150 కేంద్రాల్లో త్వరలో అల్పాహారం(టిఫిన్) అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భోజనంలానే రూ.5కే పౌరులకు అల్పాహారం అందించనున్నారు. ఒక్కో అల్పాహారానికి రూ.19 ఖర్చు కానుండగా.. అందులో రూ.14 జీహెచ్‌ఎంసీ భరించనుంది. లబ్ధిదారుల నుంచి రూ.5 వసూలు చేస్తారు.
ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పూరి, వడ వంటివి క్యాంటీన్లలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు అందించనున్నారు. ఇందుకు ఇప్పటికే ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్లను ఆధునీకరిస్తున్నారు. 10/40 పరిమాణంలో 60 కేంద్రాలు, 10/20 పరిమాణంలో 79 కేంద్రాలు సిద్ధమవుతున్నాయి. వీటికి రూ.11.29 కోట్లు ఖర్చు కానుంది. మరో 11 కేంద్రాలను ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చేందుకు రూ.13.75 లక్షలు వెచ్చిస్తున్నారు. మొత్తంగా క్యాంటీన్ల ఏర్పాటుకు రూ.11.43 కోట్లు ఖర్చు కానుండగా.. జూలై మూడో వారంలో రూ.3 కోట్లు, ఆగస్టు మొదటి వారంలో రూ.4 కోట్లు, ఆగస్టు చివరి వారంలో రూ.4.43 కోట్లు విడుదల చేయాలని భావిస్తున్నారు.
గురువారం జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించనున్నారు. అల్పాహారానికి యేటా రూ.15.33 కోట్లు అవసరమని జీహెచ్‌ఎంసీ అంచనా వేసింది. ప్రస్తుతం గ్రేటర్‌లోని 150 కేంద్రాల్లో మధ్యాహ్నం భోజనం రూ.5కే అందిస్తున్నారు. ఒక్కో భోజనానికి రూ.27.50 ఖర్చవుతుండగా.. రూ.22.50 జీహెచ్‌ఎంసీ భరిస్తూ.. లబ్ధిదారుల నుంచి రూ.5 వసూలు చేస్తున్నారు. అన్నం, ఏదైనా కూర, పప్పు, పచ్చడి అందిస్తున్నారు. నిత్యం 30 వేల మందికిపైగా ఇందిరమ్మ క్యాంటీన్లలో భోజనం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అంటే మాకూ గౌరవమే
Read Latest Telangana News and National News