Share News

GHMC: ఎక్కడా వర్షం నీరు నిలవొద్దు.. ట్రాఫిక్‌ ఆగొద్దు

ABN , Publish Date - Oct 30 , 2025 | 07:40 AM

ఎక్కడా వర్షం నీరు నిలవొద్దు.. ట్రాఫిక్‌ ఆగొద్దు అని అధికారులకు హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు సూచించారు. మొంథా తుపాను ప్రభావంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా అప్రమత్తమయ్యాయి. బుధవారం ఆయా సంస్థల కమిషనర్లు ఆర్‌వీ కర్ణన్‌, ఏవీ రంగనాథ్‌ పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.

GHMC: ఎక్కడా వర్షం నీరు నిలవొద్దు.. ట్రాఫిక్‌ ఆగొద్దు

- లక్డీకాపూల్‌, ఇతర ప్రాంతాల్లో కమిషనర్ల పరిశీలన

హైదరాబాద్‌ సిటీ: ఎక్కడా వర్షం నీరు నిలవొద్దు.. ట్రాఫిక్‌ ఆగొద్దు అని అధికారులకు హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు సూచించారు. మొంథా తుపాను ప్రభావంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా అప్రమత్తమయ్యాయి. బుధవారం ఆయా సంస్థల కమిషనర్లు ఆర్‌వీ కర్ణన్‌, ఏవీ రంగనాథ్‌(RV Karnan, AV Ranganath) పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. మాసబ్‌ట్యాంక్‌(Massabtank) నుంచి లక్డీకాపూల్‌ వెళ్లే మార్గంలో మెహిదీ ఫంక్షన్‌ హాల్‌ వద్ద రోడ్డుపై నీరు నిలవడానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.


city2.2.jpg

వర్షపు నీరు నిలవడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్న దృష్ట్యా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకటి, రెండు రోజుల్లో పైపులైన్లలోని మట్టిని తొలగించాలని, పనులు త్వరగా జరిగేలా ట్రాఫిక్‌ పోలీసులు సహకరించాలని అన్నారు.


city2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

జూబ్లీహిల్స్‌.. భిన్నంగా ఓటర్‌ పల్స్‌!

బీఆర్‌ఎస్‌ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 30 , 2025 | 07:40 AM