Share News

Gali Janardhan Reddy: గాలి అనర్హత ఆదేశాలు రద్దు

ABN , Publish Date - Jun 20 , 2025 | 04:41 AM

ఓబుళాపురం ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఉపశమనం లభించడంతో ఆయన శాసనసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు...

Gali Janardhan Reddy: గాలి అనర్హత ఆదేశాలు రద్దు

  • శాసనసభ సభ్యత్వం పునరుద్ధరణ

బెంగళూరు, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): ఓబుళాపురం ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఉపశమనం లభించడంతో ఆయన శాసనసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. గనుల కేసును విచారించిన హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. మే నెలలో గాలి జనార్దన్‌ రెడ్డికి ఏడేళ్ల జైలుశిక్ష విఽధించింది. దీంతో మే 6న గాలి జనార్దనరెడ్డి శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. అసెంబ్లీలో ఒక స్థానం తగ్గినట్టు కూడా ప్రకటించారు. సీబీఐ కోర్టు తీర్పుపై గాలి జనార్దనరెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.


హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేయడంతో పాటు ఈ దశలో ఏడేళ్ల జైలుశిక్ష అవసరం లేదని అభిప్రాయపడింది. దీంతో అనర్హత ఆదేశాలను రద్దు చేస్తున్నట్టు శాసనసభా వ్యవహారాల కార్యదర్శి విశాలాక్షి బుధవారం ప్రకటించారు.

Updated Date - Jun 20 , 2025 | 04:51 AM