Share News

Swetcha: స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందరే కారణం!

ABN , Publish Date - Jun 29 , 2025 | 04:12 AM

స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్‌రావే కారణమని.. అతణ్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ మృతురాలి తండ్రి శంకర్‌ చిక్కడపల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Swetcha: స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందరే కారణం!

  • పోలీసులకు స్వేచ్ఛ తండ్రి శంకర్‌ ఫిర్యాదు.. అతణ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌

  • లొంగిపోయిన పూర్ణచందర్‌ రావు

చిక్కడపల్లి/ముషీరాబాద్‌/అడ్డగుట్ట/నల్లకుంట, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్‌రావే కారణమని.. అతణ్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ మృతురాలి తండ్రి శంకర్‌ చిక్కడపల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఓ చానల్‌లో న్యూస్‌ యాంకర్‌గా పనిచేసే స్వేచ్ఛ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, శంకర్‌ కథనం ప్రకారం 2017లో భర్తతో విడిపోయిన స్వేచ్ఛ కొంతకాలంగా పూర్ణచందర్‌రావుతో ఉంటున్నారు. ఇటీవల వీరిద్దరి మధ్య విభేదాలు మొదలైనట్లు శంకర్‌ తెలిపారు. ‘‘ఈ నెల 26న స్వేచ్ఛ నాకు ఫోన్‌ చేసి తాను పూర్ణచందర్‌ విడిపోతున్నట్లు తెలిపింది. నన్ను వెంటనే ఇంటికి రావాలని కోరింది. ఇక పై పూర్ణచందర్‌తో కలిసి ఉండలేనని స్పష్టం చేసిం ది’’ అని ఆయన చెప్పారు. పూర్ణచందర్‌ గతంలో స్వేచ్ఛ పనిచేసే టీవీ చానల్‌లో సాంస్కృతిక కార్యక్రమాల ఇన్‌చార్జిగా పనిచేశారని, ఆ సమయంలోనే స్వేచ్ఛకు పరిచయమైనట్లు చెప్పారు. ‘‘పూర్ణచందర్‌ దుర్మార్గుడు.


ఆడపిల్లల జీవి తాలను నాశనం చేస్తున్న అతన్ని కఠినంగా శిక్షించాలి’’ అని డిమాండ్‌ చేశారు. కాగా..శంకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామ చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్‌ రాజునాయక్‌ తెలిపారు. అటు శనివారం రాత్రి పోలీసులకు లొంగిపోయిన పూర్ణచందర్‌.. అంతకు ముందు మీడియాకు ఓ లేఖను విడుదల చేశారు. చిన్నతనం నుంచి స్వేచ్ఛ ఒంటరితనాన్ని అనుభవించారని, తల్లిదండ్రులతో కలిసి ఉన్నా ఒంటరిగానే భావించేదని, ఆమె ఒత్తిడి నుంచి బయటపడేందుకు తాను అండగా నిలిచానన్నారు. కాగా స్వేచ్ఛ మృతదేహానికి గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్ద టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్‌, టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, స్వేచ్ఛ మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చాక ఎమ్మెల్యేలు ముఠాగోపాల్‌, వేముల వీరేశం, కాలేరు వెంకటేశ్‌, మందుల సామేలు, మాజీ మంత్రులు తలసాని, శ్రీనివా్‌సగౌడ్‌, మీడియా అకాడమీ మాజీ చైర్మన్‌ అల్లంనారాయణ, సీనియర్‌ పాత్రికేయులు కె.శ్రీనివాస్‌ తదితరులు నివాళులర్పించారు.


ఇవి కూడా చదవండి

పాత బాకీ అడిగితే ఇలా కొడతారా..

మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, లోకేష్

Updated Date - Jun 29 , 2025 | 04:12 AM