Share News

DGP Jitender: నక్సలిజంపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Jan 24 , 2025 | 04:03 AM

రాష్ట్రంలో నక్సలిజంపై ప్రత్యేక దృష్టి సారించామని, నార్కోటిక్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని డీజీపీ జితేందర్‌ పేర్కొన్నారు.

DGP Jitender: నక్సలిజంపై ప్రత్యేక దృష్టి

  • నార్కోటిక్స్‌పై ఉక్కుపాదం: డీజీపీ డాక్టర్‌ జితేందర్‌

మెదక్‌ అర్బన్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నక్సలిజంపై ప్రత్యేక దృష్టి సారించామని, నార్కోటిక్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని డీజీపీ జితేందర్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన మెదక్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో పరేడ్‌ మైదానం, సెల్యూట్‌ బేస్‌ను ఆవిష్కరించారు. ఎంపీ రఘునందన్‌రావు, మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. పోలీసు కవాతులో గౌరవ వందనం స్వీకరించిన డీజీపీ.. ఆతర్వాత మాట్లాడుతూ డ్రగ్స్‌ నిర్మూలన, మానవ అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పోలీసుల సరెండర్‌ లీవ్‌లు, బిల్లులకు ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదల చేసిందని, ఆరోగ్య భద్రతకు రూ.75 కోట్లు మంజూరైనట్లు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం

ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు

ఏపీతో మూడు రాష్ట్రాలతో పోటీ

మనసులో మాట చెప్పిన రఘురామ..

Updated Date - Jan 24 , 2025 | 04:03 AM