Devotees: బాసరకు పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Feb 03 , 2025 | 04:57 AM
వసంత పంచమి వేళ నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. తమ పిల్లలకు అక్షర శ్రీకార పూజలు కూడా జరిపించుకున్నారు.

వసంత పంచమి వేళ అక్షర శ్రీకార పూజలు
పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కాలి నడకన వచ్చిన భక్తులు
బాసర, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): వసంత పంచమి వేళ నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. తమ పిల్లలకు అక్షర శ్రీకార పూజలు కూడా జరిపించుకున్నారు. పూజల కోసం భక్తులు క్యూలైన్లలో మూడు నుంచి 5 గంటల సేపు వేచి చూడాల్సి వచ్చింది. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో భక్తులు కాలినడకన బాసర చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు.
భక్తులకు ఏర్పాట్లు సరిపోకపోవడంతో అడుగడుగునా ఇబ్బందులు తలెత్తాయి. తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు తగిన స్థాయిలో ఏర్పా టు చేయకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. సమాచార బోర్డులు, సహాయ కేంద్రాలు, హెల్ప్‌డె్‌స్కలు వంటివి ఏర్పాటు చేయకపోవడంతో ఏ క్యూలైన్ ఎటు వైపు ఉందో, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియక భక్తుల్లో గందరగోళం నెలకొంది.