పాత బస్తీలో ‘మెట్రో’ కూల్చివేతలు షురూ!
ABN , Publish Date - Jan 19 , 2025 | 03:39 AM
పాత బస్తీ మెట్రో నిర్మాణానికి సంబంధించిన కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఆస్తుల సేకరణలో భాగంగా ఇటీవల చెక్కులు అందజేసిన నిర్వాసితుల ఇళ్లను తొలగిస్తున్నారు.

మరోసారి భూసామర్థ్య పరీక్షలకు చర్యలు
హైదరాబాద్ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పాత బస్తీ మెట్రో నిర్మాణానికి సంబంధించిన కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఆస్తుల సేకరణలో భాగంగా ఇటీవల చెక్కులు అందజేసిన నిర్వాసితుల ఇళ్లను తొలగిస్తున్నారు. కారిడార్‌లోని దారుల్‌షిఫా నుంచి మీరాలంమండి వరకు నిర్మాణాలను తొలగిస్తూ శిథిలాలను తరలిస్తున్నారు. మొత్తం 1100 మందిలో ఇప్పటివరకు 260 మంది అనుమతి పత్రాలు అందజేశామని, ఇందులో 50 మందికి ఇటీవల చెక్కులు పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నారు.
ఫిబ్రవరి 20లోపు 1100 మందికి చెక్కులు అందజేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. నిర్వాసితులందరికీ చెక్కులు పంపిణీ చేస్తే మార్చి 1 నుంచి నిర్మాణ పనులను ప్రారంభించేందుకు హెచ్‌ఏఎంఎల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంజీబీఎ్‌స-చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న కారిడార్ నిర్మాణంలో భాగంగా హెచ్‌ఏఎంఎల్ అధికారులు మరోసారి భూసామర్థ్య పరీక్షలు చేపట్టారు.