Bachupally Crime: బ్యాగులో యువతి మృతదేహం
ABN , Publish Date - Jun 05 , 2025 | 02:28 AM
ఆ హతురాలు ఎవరు? హంతకులెవరు? ఆమెను ఎందుకు చంపారు? బాచుపల్లి విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలో ఓ బ్యాగులో కుక్కిఉన్న స్థితిలో లభ్యమైన గుర్తుతెలియని యువతి మృతదేహం విషయంలో ఇవే అనుమానాలు కలుగుతున్నాయి.

పూర్తిగా కుళ్లిన స్థితిలో..
10 రోజుల క్రితం హత్య?
కట్టుబొట్టు ఆధారంగా ఉత్తరాది మహిళ అని అనుమానం
హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఘటన.. పోలీసుల దర్యాప్తు
నిజాంపేట్/హైదరాబాద్ సిటీ, జూన్ 4(ఆంధ్రజ్యోతి): ఆ హతురాలు ఎవరు? హంతకులెవరు? ఆమెను ఎందుకు చంపారు? బాచుపల్లి విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలో ఓ బ్యాగులో కుక్కిఉన్న స్థితిలో లభ్యమైన గుర్తుతెలియని యువతి మృతదేహం విషయంలో ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. బ్యాగులోంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారొచ్చి దాన్ని తెరిచిచూస్తే 25-30 ఏళ్ల వయసున్న యువతి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. సీఐ ఉపేందర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. హతురాలి ఒంటిమీద మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్, చున్నీ ఉన్నాయి. చేతికి మట్టిగాజులున్నాయి.
ఆమె మెడకు నవారు వైరు చుట్టి ఉంది. ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా కట్టుబొట్టు ఆధారంగా హతురాలిని ఉత్తరాది యువతిగా భావిస్తున్నారు. బొల్లారం పరిధిలో భారీ సంఖ్యలో ఫార్మా కంపెనీలు, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచీ ట్రాన్స్‌పోర్టు వాహనాలు ఇక్కడికి వస్తుంటాయి. ఈ క్రమంలో దుండగులు, యువతిని చంపి.. బ్యాగులో కుక్కి.. వాహనంలో తెచ్చి ఇక్కడ పడేసి ఉంటారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచారం చేసి.. చంపి ఉంటారని భావిస్తున్నారు. పదిరోజుల క్రితం హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈమేరకు ఆ సమీప ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇవీ చదవండి:
రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి