పెద్ద కంపెనీలకే కాదు.. స్టార్ట్‌పలకూ సైబర్ ముప్పు
ABN , Publish Date - Feb 20 , 2025 | 04:36 AM
సైబర్ సెక్యూరిటీ ముప్పు బడా కంపెనీలకు మాత్రమే కాదని, స్టార్ట్‌పలకూ ఉంటుందని రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. వ్యాపార సంస్థలు, స్టార్ట్‌పలు కూడా సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించాలన్నారు.

డిజిటల్ లావాదేవీలకు రెండంచెల ధ్రువీకరణ ఉత్తమం
షీల్డ్ సదస్సులో జయేశ్‌రంజన్
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): సైబర్ సెక్యూరిటీ ముప్పు బడా కంపెనీలకు మాత్రమే కాదని, స్టార్ట్‌పలకూ ఉంటుందని రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. వ్యాపార సంస్థలు, స్టార్ట్‌పలు కూడా సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించాలన్నారు. డేటా భద్రతపరంగా ఏర్పడే లోపాలు.. వ్యాపారాలకు గొడ్డలిపెట్టుగా మారుతాయని హెచ్చరించారు. ప్రభుత్వం కూడా ఇందుకు మినహాయింపు కాదని, అందుకే ప్రభుత్వ ఆన్‌లైన్ ఆస్తుల పరిరక్షణకు 2017లో ‘సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్’ను ప్రారంభించామని గుర్తుచేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎ్‌సబీ), సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎ్‌ససీఎ్‌ససీ) సంయుక్తంగా హెచ్‌ఐసీసీలో రెండ్రోజుల పాటు నిర్వహించిన ‘షీల్డ్ - షీల్డింగ్ ద వల్నరబుల్ సెక్యూరింగ్ డిజిటల్ ఫ్యూచర్- సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్-2025’ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దు(డీమానిటైజేషన్), కొవిడ్ కల్లోలం తర్వాత డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని, అదే స్థాయిలో సైబర్ సెక్యూరిటీ ముప్పు ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ బాధితులుగా మారకుండా ఉండాలంటే.. డిజిటల్ లావాదేవీలకు రెండంచెల భద్రతను ఎంచుకోవడం ఉత్తమమన్నారు. సైబర్ సెక్యూరిటీలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. షీల్డ్‌లో భాగంగా ఐఐటీ, ఐఎ్‌సబీ, నల్సార్ వంటి విద్యాసంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం అభినందనీయమని చెబుతూ.. సీ-డాక్, సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వంటి సంస్థలను కూడా భాగస్వాములుగా చేసుకోవాలని సూచించారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, రోజూ వందల కేసులు నమోదవుతున్నాయని గుర్తుచేశారు. ప్రజలను సైబర్ ముప్పు నుంచి కాపాడేందుకు పోలీసు శాఖ పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో సీఐడీ చీఫ్ శిఖాగోయల్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మొహంతి, ఎస్‌సీఎ్‌ససీ సెక్రటరీ జనరల్ రమేశ్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.