Home » IT Companies
రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో మొదటి దశలో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారిలో కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 54 లక్షల మంది ఐటీ రంగంలో పని చేస్తుండగా.. వారిలో 84 శాతం మందికి పైగా ఫ్యాటీ లివర్ సహా పలు కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
సైబర్ సెక్యూరిటీ ముప్పు బడా కంపెనీలకు మాత్రమే కాదని, స్టార్ట్‌పలకూ ఉంటుందని రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. వ్యాపార సంస్థలు, స్టార్ట్‌పలు కూడా సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించాలన్నారు.
దావోస్‌లో తెలంగాణ దుమ్మురేపింది! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం సరికొత్త రికార్డులు సృష్టించింది! రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈసారి ఏకంగా రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది.
అమెరికాలో ఐటీ కంపెనీల అతిపెద్ద సంఘంగా ఉన్న ఐటీ సర్వ్ అలయన్స్ రాష్ట్ర ప్రభుత్వంతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో 30వేల ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు సహకారం అందించనుంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత గత 11 నెలల్లో 140 ప్రాజెక్టులకు సంబంధించి సుమారు 36వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కోన్నారు.
ఐటీ కారిడార్(IT Corridor)లో శని, ఆదివారాల్లో రాత్రిళ్లు రహదారులపై కొందరు యువత ప్రమాదకర స్థితుల్లో బైక్‌రేస్‌లు చేస్తూ, స్టంట్లు కొడుతున్నారు. రేసింగ్ చేస్తూ.. బైక్‌లను గాలిలోకి లేపుతూ.. మంటలు పుట్టిస్తున్నారు. కొందరు అయితే అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ.. స్టాండ్‌లను రోడ్డుకు తాకేలా కాళ్లతో పట్టి మంటలు పుట్టేలా చేస్తున్నారు.
ఐటీ ఎగుమతుల వృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
సైబరాబాద్ కమిషనరేట్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది ఐటీ కారిడార్. వేలాది ఐటీ కంపెనీలు.. రోజుకు సుమారు 15–20 లక్షల మంది వాహనదారులు రాకపోకలు సాగించే అత్యధిక రద్దీ ప్రాంతం.. అలాంటి ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడానికి సైబరాబాద్ పోలీసులు అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు.