Share News

Cyber Crime: ఆ లింక్‌లు తెరిచారో... ఇక మీ పని అయిపోయినట్లే...

ABN , Publish Date - Nov 25 , 2025 | 08:36 AM

సైబర్ నేరగాళ్లు సరికొత్త పంధాను ఎంచుకున్నారు. సోషల్‌ మీడియాలో, వాట్సాప్‏లో బ్యాంకులు, ప్రభుత్వ సేవల పేర్లతో సైబర్‌ నేరగాళ్లు ఏపీకే లింక్‌లు పంపుతున్నారు. ఈ లింక్‏లను ఓపెన్ చేస్తే.. ఖాతాలో ఉన్న నగదు మొత్తం మాయమైపోతోంది. ఈ తరహ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీస్ యంత్రాంగం సూచిస్తోంది.

Cyber Crime: ఆ లింక్‌లు తెరిచారో... ఇక మీ పని అయిపోయినట్లే...

- పోలీస్‌ అధికారుల సూచన

- బ్యాంకు, ప్రభుత్వ సేవల పేరుతో ఏపీకే లింక్‌లు పంపిస్తున్న సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: సోషల్‌ మీడియాలో, వాట్సాప్‏లో బ్యాంకులు, ప్రభుత్వ సేవల పేర్లతో సైబర్‌ నేరగాళ్లు ఏపీకే లింక్‌లు పంపుతున్నారని, కొత్త నంబర్ల నుంచి వచ్చిన అనుమానాస్పద ఏపీకే లింక్‌లను తెరవద్దని సైబర్‌ క్రైం అధికారులు సూచిస్తున్నారు. ఆ లింక్‌లు తెరిస్తే అందులో ఉన్న మాల్‌వేర్‌ సాయంతో ఫోన్‌ను నియంత్రణలో తీసుకుంటున్న సైబర్‌ క్రిమినల్స్‌(Cyber Crime) అందులో ఉన్న సమాచారాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తారని హెచ్చరించారు. ఈ సందర్భంగా మోసాల తీరు, జాగ్రత్తలు వెల్లడించారు.


- సైబర్‌ నేరగాళ్లు పెండింగ్‌ చలాన్లు, కరెంట్‌ బిల్లులు, బ్యాంకులో ఆధార్‌ అప్‌డేట్‌, క్రెడిట్‌ కార్డు, ఉద్యోగ అవకాశాలు, నీటి బిల్లులు, పీఎం కిసాన్‌ యోజన అంటూ పలు ప్రభుత్వ శాఖల సేవల పేర్లతో ఏపీకే లింక్‌లను రూపొందిస్తున్నారు.

- ప్రభుత్వ పథకాలు, బ్యాంకు సేవలు ఆన్‌లైన్‌లో పొందాలంటే ఏపీకే లింక్‌ను తెరిచి వివరాలు నమోదు చేయమని కోరతారు.

- ఏపీకే లింక్‌లు డౌన్‌లోడ్‌ చేస్తున్న సమయంలో ఎస్‌ఎంఎస్‌, కాంటాక్ట్స్‌, నోటిఫికేషన్‌, స్ర్కీన్‌ షేరింగ్‌ అనుమతులు తీసుకుంటారు.


city5.jpg

- ప్లే స్టోర్‌ నుంచి కాకుండా తాము పంపిన లింక్‌ ద్వారా యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరతారు.

- ప్రముఖ బ్యాంకుల వెబ్‌సైట్‌లను పోలిన నకిలీ వెబ్‌సైట్లలో వివరాలు నమోదు చేయిస్తారు.

- ఏపీకే ఫైల్స్‌ మాటున ఉన్న మాల్‌వేర్‌ సాయంతో ఫోన్‌ను నియంత్రణలోకి తీసుకుంటారు.

- ఫోన్‌లో సెట్టింగ్స్‌ మార్చి, సందేశాలు, ఫోన్‌లు వేరే నంబర్‌కు వచ్చేలా చేస్తారు.


- ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్‌ వివరాలు సేకరిస్తారు. ఫొటోలు, వీడియోలు దుర్వినియోగం చేస్తారు.

- వాట్సాప్‏లో లాగిన్‌ అయి మెసేజ్‌లను చదువుతారు, ఫోన్‌ నంబర్‌ ద్వారా కొత్త ఫోన్‌లో వాట్సాప్‌ ఇన్‌స్టాల్‌ చేస్తారు

- వాట్సాప్‌ ద్వారా స్నేహితులకు, బంధువులకు అత్యవసరంగా డబ్బు కావాలని సందేశాలు పంపుతారు

- బ్యాంకుల నుంచి వచ్చే ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ చేస్తారు.


city6.2.jpg

- సైబర్‌ నేరగాళ్లు విదేశాల నుంచి చేసే ఈ మోసంలో నిందితులను పట్టుకోవడం కష్టంగా మారుతోంది.

- బ్యాంకింగ్‌, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఏపీకే లింక్‌లు పంపరని గుర్తుంచుకోండి.

- ఎప్పటికప్పుడు ఓఎ్‌సను అప్‌డేట్‌ చేసుకోవాలి. సెక్యూరిటీ టూల్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి.. పసిడి, వెండి ధరల్లో కోత

అది బూటకపు ఎన్‌కౌంటర్‌: ఈశ్వరయ్య

Read Latest Telangana News and National News

Updated Date - Nov 25 , 2025 | 08:36 AM