Cyberabad Police Commissionerate: సరికొత్త రూపంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్
ABN , Publish Date - Jul 29 , 2025 | 06:59 AM
పౌరులకు పారదర్శక సేవలను పెంపొందించడానికి సరికొత్తగా అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని వయసుల వారికీ అందుబాటులో ఉండేలా, ప్రజలకు ముఖ్యమైన హెచ్చరికలు, సమాచారం వెంటనే తెలిసేలా సాంకేతిక బృందం డిజైన్ చేసిందని వివరించారు.

హైదరాబాద్ సిటీ: పౌరులకు పారదర్శక సేవలను పెంపొందించడానికి సరికొత్తగా అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని వయసుల వారికీ అందుబాటులో ఉండేలా, ప్రజలకు ముఖ్యమైన హెచ్చరికలు, సమాచారం వెంటనే తెలిసేలా సాంకేతిక బృందం డిజైన్ చేసిందని వివరించారు. రియల్ టైమ్ కంటెంట్‌తో మొబైల్‌లోనూ సులభంగా వెబ్‌సైట్‌ను చూడొచ్చన్నారు.
ఫీడ్‌బ్యాక్ స్కానర్
పోలీసు శాఖ కొత్తగా సిటిజన్ ఫీడ్ బ్యాక్ కోసం తీసుకువచ్చిన ‘క్యూఆర్ కోడ్ స్కానర్’ వెబ్‌సైట్(Website)లో ఉంటుంది. ఇది పోలీసు అధికారుల పనితీరు, సామర్థ్యంపై ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయడానికి వీలు కల్పిస్తుంది. మారథాన్‌లు, మ్యూజిక్ షోలు, ఫిల్మ్ షూటింగ్‌లు వంటి ఈవెంట్‌ల అనుమతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి పౌరులకు సౌకర్యంగా ఉంటుంది.
సైబర్ నేరాల బాధితుల కోసం..
సైబర్ నేరాల బారిన పడినబాధితులు ఆన్‌లైన్‌లో తమ ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని వెబ్‌సైట్‌లో లింక్ ఉంటుంది. దేశంలోని ఇతర నగరాల్లో నివసించే బాధితులకు సైతం ఇది ప్రత్యేకంగా సహాయపడేలా దీన్ని తీర్చిదిద్దామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. అలాగే సైబర్ నేరంపై ఫిర్యాదు చేయడానికి బాధితుడికి సరైన మార్గదర్శనం చేస్తుందన్నారు. వీటితో పాటు కీలక అధికారుల వివరాలు, వారు పనిచేసే హోదా, విధులతో పాటు పోలీస్ స్టేషన్‌ల సమాచారం చూడగానే అందరికీ అర్థమయ్యేలా కొత్త వెబ్‌ను రూపొందించామని ఆ ప్రకటనలో తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు
ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గుచేటు
Read Latest Telangana News and National News