CV Anand: ఇసుక అక్రమ రవాణాపై.. ఉక్కుపాదం
ABN , Publish Date - Feb 21 , 2025 | 08:20 AM
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసి, విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(Hyderabad City Police Commissioner CV Anand) స్పష్టం చేశారు.

- 5 రోజుల్లో.. 26 కేసులు
- 57 మంది నిందితుల అరెస్ట్
హైదరాబాద్ సిటీ: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసి, విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(Hyderabad City Police Commissioner CV Anand) స్పష్టం చేశారు. ఈ మేరకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు వివరించారు. ఈ నెల 14 నుంచి 19 వరకు సిటీ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 26 కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: వారిద్దరిని పట్టించిన వారికి రూ.5 లక్షలు..
కాగా.. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న 8 వాహనాలను సీజ్ చేశామన్నారు. ఇప్పటి వరకు 57 మంది నిందితులను అరెస్టు చేసి, కటకటాల్లోకి నెట్టారు. 1,196 టన్నుల ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రజా రక్షణ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు..
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.. అక్రమంగా ఇసుక రవాణాను ప్రోత్సహించి అడ్డగోలు దందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసులను రంగంలోకి దింపి ఇసుక అక్రమ రవాణాను అరికడుతున్నట్లు సీపీ వెల్లడించారు.
ఈవార్తను కూడా చదవండి: Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట
ఈవార్తను కూడా చదవండి: యువ వైద్యురాలి ప్రాణం తీసిన ఈత సరదా
ఈవార్తను కూడా చదవండి: చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ
ఈవార్తను కూడా చదవండి: అడవి పందుల వేటకు వెళ్లి... విద్యుదాఘాతానికి ముగ్గురి బలి
Read Latest Telangana News and National News