CPI: మోదీ గ్రాఫ్ పడిపోయిందనే..
ABN , Publish Date - Aug 03 , 2025 | 05:11 AM
మోదీ గ్రాఫ్ పడిపోయిందనే నాయకులకు 75 ఏళ్ల వరకే పదవీ కాలం అనే అంశాన్ని ఆరెస్సెస్ తెరపైకి తీసుకొచ్చిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ అన్నారు.

75 ఏళ్లకే రిటైర్మెంట్ అంశాన్ని తెరపైకి తెచ్చిన ఆర్‌ఎస్‌ఎస్: నారాయణ
హైదరాబాద్, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): మోదీ గ్రాఫ్ పడిపోయిందనే నాయకులకు 75 ఏళ్ల వరకే పదవీ కాలం అనే అంశాన్ని ఆరెస్సెస్ తెరపైకి తీసుకొచ్చిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ అన్నారు. పహల్గాం ఉగ్రవాదులను పార్లమెంట్ సమావేశాలకు ఒక్కరోజు ముందు హతమార్చి, వారి శవాలను అడ్డం పెట్టుకుని సభలో తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అబద్ధాలను అవలీలగా చెప్పే వ్యక్తులు దేశంలో ఇద్దరే ఇద్దరు ఉన్నారని, అందులో మొదటివారు మోదీ, రెండో వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. శనివారం ఆయన సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ బానిసత్వం చేయడం అవమానకరమన్నారు. కర్ణాటకలోని ధర్మస్థల ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకోవాలని, బోర్డు సభ్యులందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులను 4ఏళ్లుగా పెండింగ్‌లో పెట్టడమంటే నేరమేనన్నారు. కాళేశ్వరం అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల పార్టీ ఫిరాయింపులపై ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని నిలదీశారు. ఎవరైనా పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే ఎన్నికల కమిషన్ వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు.