Share News

BRS vs Congress Rivalry: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే గెలుపు

ABN , Publish Date - Jul 20 , 2025 | 03:29 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే గెలుపని, భారీ మెజారిటీ ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ధీమా

BRS vs Congress Rivalry: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే గెలుపు
BRS vs Congress Rivalry

  • బనకచర్లపై హరీశ్‌వి అబద్ధాలు: మహేశ్‌ గౌడ్‌

  • కాంగ్రెస్‌లో చేరిన జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ నేతలు

హైదరాబాద్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే గెలుపని, భారీ మెజారిటీ ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. బనకచర్ల విషయంలో హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్‌లో బీఆర్‌ఎస్‌ నేతలు మురళిగౌడ్‌, సంజయ్‌గౌడ్‌తోపాటు పలువురు కాంగ్రెస్‌లో చేరారు. వీరికి మహేశ్‌గౌడ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక నుంచి ఏ ఎన్నిక వచ్చినా బీఆర్‌ఎస్‌ ఉనికే ఉండబోదన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత అబద్ధాలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో ఉంచేందుకు సీఎం రేవంత్‌ కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల మేరకే పాలన సాగుతోందని.. అందుకే కాంగ్రెస్‌లో చేరికలు జరుగుతున్నాయని చెప్పారు. కాగా, మహేశ్‌తో ఆదిలాబాద్‌ జిల్లా నేతలు భేటీ అయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా మల్లెపూల నర్సయ్యను నియమించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News and National News

Updated Date - Jul 20 , 2025 | 03:29 AM