Hyderabad: ప్రజాపాలన చేస్తున్న విప్లవకారుడు సీఎం రేవంత్
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:01 AM
సీఎం రేవంత్‌రెడ్డి రబ్బర్ స్టాంప్ కాదని, ప్రజాపాలన చేస్తున్న విప్లవకారుడని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. రేవంత్ పాలన చేపట్టిన 15 నెలల్లోనే ఎన్నో విప్లవాత్మక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు.

సంజయ్ తొండి, మొండి మాటలు మానాలి: మల్లు రవి
కంచ గచ్చిబౌలి భూములపై బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్ర: చామల
సన్నబియ్యం పథకంపై బీఆర్‌ఎస్ దుష్ప్రచారాన్ని సహించం: మేడిపల్లి
హైదరాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి రబ్బర్ స్టాంప్ కాదని, ప్రజాపాలన చేస్తున్న విప్లవకారుడని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. రేవంత్ పాలన చేపట్టిన 15 నెలల్లోనే ఎన్నో విప్లవాత్మక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. సీఎంను రబ్బర్ స్టాంప్ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించడం అవివేకమన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘56 వేల ఉద్యోగాలిచ్చిన ఘనత రేవంత్‌ది. రాజీవ్ యువవికాసం పేరుతో 6 లక్షల మంది యువతకు సబ్సిడీతో ఉపాధి కల్పిస్తున్నారు. సన్నబియ్యం పథకాన్ని అమలు చేసి పేదల కడుపు నింపుతున్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్న సీఎంను రబ్బర్ స్టాంప్ అంటారా..?’ అని నిలదీశారు. మీనాక్షి నటరాజన్ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ అని.. ఆమె ఇక్కడ పార్టీ వ్యవహారాల్లో మాట్లాడితే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇకనైనా బండి సంజయ్ తొండి, మొండి మాటలు మాని, తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు కలిసి కుట్రకు తెరలేపాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
ఆ భూములపై ఎలాంటి హక్కు లేదని హెచ్‌సీయూ విద్యార్థులకు, వారిని రెచ్చగొట్టేవారికి కూడా తెలుసని చెప్పారు. ఈ భూముల వ్యవహారానికి సంబంధించిన కొందరు ఏఐ ఫేక్ ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో షేర్ చేశారని.. విషయం తెలిసి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తాను పెట్టిన ట్వీట్‌ను డిలీట్ చేయడాన్ని హర్షిస్తున్నామన్నారు. పేదోడు సన్నబియ్యం బువ్వ తినాలన్న ఆశయంతో సీఎం రేవంత్ గొప్ప పథకానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సన్నబియ్యం పథకంపై బీఆర్‌ఎస్ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తోందని, పేదోడి కంచంలో మట్టిపోయాలని చూస్తే పాతరేస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు. వక్ఫ్(సవరణ) చట్టంపై న్యాయ పోరాటంతో పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేస్తామని టీపీసీసీ అధికార ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్ చెప్పారు. కాగా, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో అంబేడ్కర్ ఆశయాలను సాధించేందుకు రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని మాజీ ఎంపీ వీహెచ్ కొనియాడారు. ఈనెల 11న మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి, 14వ తేదీన అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని వేడుకలను ఘనంగా నిర్వహించడానికి పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్
దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారు..
మరో ఆరుగురికి నోటీసులు.. విచారణ...
For More AP News and Telugu News