Home » Chamala Kiran Kumar Reddy
లోక్ సభలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంపీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీ పునర్విభజన చట్టం బిల్లుపై చర్చ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడిన తీరుపై చామల మండిపడ్డారు.
బీఆర్ఎస్ నేతలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు చేరిపివేసి ఇప్పుడు తెలంగాణ ఆత్మ గౌరవం గుర్తుకు వస్తుందా అని ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. నూతన సంవత్సరం తొలి రోజునే కేటీఆర్ గోబెల్స్ ప్రచారాన్ని మొదలు పెట్టారని విమర్శించారు.
నిరుద్యోగల కోసం సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగులు వారి తల్లిదండ్రుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని పేర్కొన్నారు.
బిహార్ రాష్ట్రంలో ఎలాంటి ప్రజా లెక్కలు లేకుండా.. మైనారిటీ, క్రిస్టియన్ల ఓట్లని తొలగించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆ ఓట్లు పడవనే వాటిని తీసేశారని విమర్శించారు. ఓట్ల చోరీపై చర్చ చేస్తే దొంగలెవరో బయటపడుతారని ఎద్దేవా చేశారు. అందుకోసమే.. కనీసం చర్చ కూడా చేయకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతారని మండిపడ్డారు.
బీసీలపై బీజేపీ, బీఆర్ఎస్‌లకు చిత్తశుద్ధి ఉంటే.. 42శాతం పార్టీ పరంగా ఇస్తామని ప్రకటించాలని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. రేవంత్‌రెడ్డిని బీజేపీ ఎంపీలు కాపాడితే.. తెలంగాణ నంబర్ వన్ అయ్యేదని.. మెట్రో ఫేజ్- 2 వచ్చేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు తెలంగాణ రాష్ట్రానికి 9.80లక్షల మెట్రిక్ టన్నులు యూరియాను కేంద్రం కేటాయించిందని తెలిపారు. కానీ ఇప్పటి వరకు కేవలం 4.50 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా మాత్రమే కేంద్రం సరఫరా చేసిందని చెప్పారు. ఆగస్టు 13వ తేదీ వరకు ఇంకా 6.60లక్షల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉందని చామల పేర్కొన్నారు.
తెలంగాణకు యూరియా ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి దుయ్యబట్టారు.
ఎర్రకోటపై జరిగిన స్వాతంత్ర వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాజ్యాంగ బద్ధంగా, పారదర్శకంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం బీజేపీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.