Share News

Chamala Kiran Kumar Reddy: రేవంత్‌పై బీఆర్‌ఎస్‌ నేతల అక్కసు: చామల

ABN , Publish Date - Jul 28 , 2025 | 03:43 AM

దేశవ్యాప్తంగా సీఎం రేవంత్‌ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్కసుతో బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు.

Chamala Kiran Kumar Reddy: రేవంత్‌పై బీఆర్‌ఎస్‌ నేతల అక్కసు: చామల

  • బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని స్పష్టమైంది: మేడిపల్లి

  • రేవంత్‌ను టార్గెట్‌ చేయడం ఎవరి వల్ల కాదు: అద్దంకి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సీఎం రేవంత్‌ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్కసుతో బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్‌, హరీశ్‌ రావు ఏదైనా డ్రామా చేస్తుంటే.. మధ్యలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుల్లా జగదీశ్‌ రెడ్డి, పాడి కౌశిక్‌ రెడ్డి హడావుడి చేస్తుంటారని ఎద్దేవా చేశారు. ఆదివారం ఢిల్లీలో చామల మాట్లాడుతూ.. కేసీఆర్‌తో పోలిస్తే వందరెట్లు ఎక్కువగా సామాజిక న్యాయం, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి రేవంత్‌ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు.


బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు వేరు కాదంటూ తాము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నామని, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ వ్యాఖ్యలతో ఇది మరోమారు స్పష్టమైందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సీఎల్పీ మీడియా హాల్లో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎ్‌సకు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని, ప్రజలు దీనిపై ఆలోచన చేయాలన్నారు. సీఎం రేవంత్‌ను టార్గెట్‌ చేయడం కేసీఆర్‌ వల్లే కాలేదని, ఇంకా కేటీఆర్‌, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి వల్ల ఏమైతదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు. కేటీఆర్‌ తన భాష మార్చుకోకపోతే తమ బీ టీమ్‌ రంగంలోకి దిగుతుందని, అప్పుడు ఆయన తట్టుకోలేడన్నారు.

Updated Date - Jul 28 , 2025 | 03:43 AM