Hyderabad: అవినీతిలో అందెవేసిన చేయి కాంగ్రెస్ సర్కార్‌దే..
ABN , Publish Date - Dec 04 , 2025 | 10:28 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలన్నీ నేడు నీటి మూటలుగానే మిగిలిపోయాయన్నారు. రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేయడవలో దిట్టగా మారిందన్నారు.
- ఎమ్మెల్యే మధుసూదనాచారి
హైదరాబాద్: రేవంత్‌రెడ్డి సర్కార్ అంటేనే ఆమ్యామ్యాల సర్కార్, ఎన్నో పోరాటాలు ఉద్యమాలు, ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీలేదు గాని అవినీతిలో మాత్రం అందెవేసిందని ఎమ్మెల్యే మధుసూదనాచారి(MLA Madhusudhanachary) తీవ్రంగా దుయ్యబట్టారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌పర్మేషన్ పాలసీ పేరిట కాంగ్రెస్ పార్టీ రూ.5 లక్షల కోట్ల భూకుంబకోణం అంటూ బీఆర్‌ఎస్ పోరుబాట నిర్వహిస్తుంది.

ఇందులో భాగంగా బుధవారం మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియా లో ప్రజల్లో ఈ పాలసీ వల్ల జరిగే నష్టాన్ని వివరించారు. కార్యక్రమానికి హాజరైన మధుసూదనాచారి మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డి సర్కార్ అంటే అబద్దాలు చెప్పడమన్నా రు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడు తూ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాలను అప్పనంగా అమ్ముకుంటుందని అన్నారు. అనంతరం మౌలాలి ఇండస్ట్రియల్ ప్రాంతంలో బీఆర్‌ఎస్ నేతలు పాలసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సునీతరాముయాదవ్, చింతల శ్రీనివా్‌సరెడ్డి, మాజీకార్పొరేటర్లు పాల్గొన్నారు.
‘ప్రభుత్వానిది పెద్ద కుట్ర’
నాచారం, డిసెంబరు3 (ఆంధ్ర జ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్‌టాప్ పాలసీలో పెద్ద కుట్ర ఉందని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. నాచారం పారిశ్రామిక వాడలో ఉప్పల్ ఎమ్మెల్యేతో కలిసి ఆయన పర్యటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి, మాజీ ఎమ్మెల్యే కె.ప్రభాకర్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత పెరిగిన పుత్తడి ధరలు.. రికార్డు స్థాయికి వెండి
Read Latest Telangana News and National News