Share News

CM Revanth Reddy: కార్మికలోకానికి ‘మే’డే శుభాకాంక్షలు

ABN , Publish Date - May 01 , 2025 | 04:41 AM

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్మిక లోకానికి ‘మే’ డే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని పేర్కొన్నారు.

CM Revanth Reddy: కార్మికలోకానికి ‘మే’డే శుభాకాంక్షలు

  • శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు

  • త్వరలో గిగ్‌, ప్లాట్‌ఫాం వర్కర్ల సంక్షేమ బిల్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్మిక లోకానికి ‘మే’ డే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజాప్రభుత్వం పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. మే డే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. తాము అధికారం చేపట్టిన వెంటనే గిగ్‌ వర్కర్ల కోసం రూ.5లక్షల ప్రమాద బీమాను అమలు చేశామని తెలిపారు. ఇక, తెలంగాణ గిగ్‌, ప్లాట్‌ఫాం వర్కర్ల సంక్షేమ బిల్లు-2025ను త్వరలో తీసుకువస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని సీఎం పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను భర్తీ చేశామన్నారు. గల్ఫ్‌ దేశాల్లో పని చేస్తున్న తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు.


సింహాచలం ఘటన ఆవేదన కలిగించింది : సీఎం

సింహాచలంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద గోడ కూలి భక్తులు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని సీఎం రేవంత్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు.


Also Read:

BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్‌ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ

Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..

Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..

Updated Date - May 01 , 2025 | 04:41 AM