CM Revanth Reddy: పేద బిడ్డల విద్యపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం.. క్షమించరాని నేరం
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:23 AM
పేద బిడ్డల విద్యపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించరాని నేరమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్
‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ట్యాగ్ చేసిన సీఎం
హైదరాబాద్, ఏప్రిల్, 8 (ఆంధ్రజ్యోతి): పేద బిడ్డల విద్యపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించరాని నేరమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిందని.. గడిచిన 15 ఏళ్లుగా ఈ ప్రక్రియ జరగకపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగించిందంటూ ఎక్స్ వేదికగా సీఎం మంగళవారం ట్వీట్ చేశారు.
‘వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ప్రచురితమైన కథనాన్ని ట్వీట్‌కు జత చేశారు. ప్రతి వ్యవస్థలో జరిగిన ఇలాంటి తప్పిదాలను గుర్తిస్తూ, సరిచేస్తూ.. ప్రజా ప్రభుత్వం రాష్ట్ర పునర్ నిర్మాణం దిశగా అడుగులు వేస్తోందని ట్వీట్‌లో స్పష్టం చేశారు.