Share News

Manda Krishna Madiga: పింఛన్‌దారులకు రేవంత్‌ మోసం

ABN , Publish Date - Jul 22 , 2025 | 05:14 AM

రాష్ట్రంలోని పింఛన్‌దారులను సీఎం రేవంత్‌రెడ్డి మోసగిస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు.

Manda Krishna Madiga: పింఛన్‌దారులకు రేవంత్‌ మోసం

ఆమనగల్లు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పింఛన్‌దారులను సీఎం రేవంత్‌రెడ్డి మోసగిస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పింఛన్‌ రూ.6 వేలు, ఆసరా పింఛన్‌ రూ.4 వేలు ఇస్తామని హామీనిచ్చారని.. 19 నెలలు దాటినా అమలు చేయట్లేదని విమర్శించారు. పింఛన్‌దారులకు అందాల్సిన సొమ్ము.. నెలకు రూ.వెయ్యి కోట్ల చొప్పున ఇప్పటివరకు రూ.20 వేల కోట్లు పక్కదారి పట్టించారని ఆరోపించారు.


సోమవారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల, ఆసరా పింఛన్‌దారుల జిల్లా మహాసభకు మంద కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆగస్టు 13న హైదరాబాద్‌లో ‘పింఛన్‌దారుల గర్జన’ పేరుతో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు పింఛన్‌దారులు తరలిరావాలని పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 06:12 AM