Share News

Bandi Sanjay: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. సీఎం రమేష్ వ్యాఖ్యలపై బండి సంజయ్ క్లారిటీ

ABN , Publish Date - Jul 27 , 2025 | 01:20 PM

కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్‌పై ఘాటు విమర్శలు చేశారు. ఆ పార్టీ పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని, ఇక దానిని నడిపించడం అసాధ్యమన్నారు. ఇది ప్రజల సమస్యల కంటే కుటుంబం కోసమే పనిచేస్తోందని ఆరోపించారు.

Bandi Sanjay: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. సీఎం రమేష్ వ్యాఖ్యలపై బండి సంజయ్ క్లారిటీ
Bandi Sanjay CM Ramesh KTR

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ సీఎం రమేష్ మధ్య వివాదం రచ్చగా మారింది. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, దాన్ని నడపడం ఆ పార్టీకి సాధ్యం కావడం లేదని కేంద్ర మంత్రి విమర్శించారు. అవినీతికి కొమ్ముకాయడమే కాకుండా, ప్రజాస్వామ్య విలువల్ని పక్కనపెట్టి కుటుంబ ఆస్తిగా పార్టీని నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు.


కొడుకుకే టికెట్ ఇవ్వలే..

బీఆర్ఎస్ అంటే బిడ్డా, అల్లుడు, కొడుకు, అయ్య పార్టీ అని బండి సంజయ్ అభివర్ణించారు. అంతేకాదు, కేటీఆర్‎కు సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ సీఎం రమేష్ సాయంతోనే వచ్చిందన్నారు. కేసీఆర్ మొదట కొడుకుకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి సీఎం రమేష్ చెప్పిన విషయాలు నిజమని, కానీ బీజేపీ అలాంటి విలీనాన్ని ఒప్పుకోదని స్పష్టం చేశారు.


ఊరుకోమని హెచ్చరిక..

కేటీఆర్ ఢిల్లీలో తన ఇంటికి వచ్చి, కవిత విషయంలో విచారణ ఆపాలని, బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామని చెప్పారని ఆరోపించారు. బండి సంజయ్, కేటీఆర్‌ను ఉద్దేశించి, ఆయన భాషను మార్చుకోవాలని, పోలీసులను అవమానించడం, బీజేపీ నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. వీటిపై కరీంనగర్‌లో చర్చకు రావాలని సవాల్ చేశారు.


కేటీఆర్ చర్చకు సిద్ధమా

ఈ క్రమంలో వేదిక తాను ఏర్పాటు చేస్తానని, తేదీని కేటీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు. ఈ వివాదంలో ఎవరి వాదనలు నిజమో తేల్చేందుకు బహిరంగ చర్చకు రావాలని బండి సంజయ్ కోరారు. సీఎం రమేష్‌ను తాను తీసుకొస్తానని, కేటీఆర్ రావడానికి సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారాయి. ఇవి ఎక్కడికి మలుపు తిప్పుతాయో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 27 , 2025 | 01:31 PM