BJP: తెలంగాణలో సంచలనం.. బీజేపీ నాయకుడి హత్యకు కుట్ర..!
ABN , Publish Date - Apr 20 , 2025 | 06:00 PM
బీజేపీలో ఆయన చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ప్రజలతో నిత్యం మమేకం అవుతారు. దేవరకద్ర నియోజకవర్గం బీజేపీ ఇన్ చార్జి కూడా. ఆ నాయకుడిని చంపేందుకు కుట్రలు చేస్తున్నారు అగంతకులు. అతన్ని చంపేందుకు రూ. 2.5 కోట్లు లీడ్ కూడా కుదుర్చుకున్నారు.

హైదరాబాద్, ఏప్రిల్ 20: బీజేపీలో ఆయన చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ప్రజలతో నిత్యం మమేకం అవుతారు. దేవరకద్ర నియోజకవర్గం బీజేపీ ఇన్ చార్జి కూడా. ఆ నాయకుడిని చంపేందుకు కుట్రలు చేస్తున్నారు అగంతకులు. అతన్ని చంపేందుకు రూ. 2.5 కోట్లు లీడ్ కూడా కుదుర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఇంతకీ ఎవరా నాయకుడు.. ఆయన్న ఎందుకు చంపాలనుకుంటున్నారు.. అసలేం జరుగుతోంది.. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కొందరు కుట్ర చేశారు. కర్నూల్, కర్ణాటక రౌడీ షీటర్లు ప్రశాంత్ రెడ్డిని చంపేందుకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఓ హత్య కేసులో ప్రశాంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఆ కేసుకు సంబంధించిన వారే ప్రశాంత్ రెడ్డిని హతమార్చేందుకు ప్లాన్ చేస్తున్నారనే అనుమానలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. ఆయన్ను చంపేందుకు రూ. 2.5 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు.. తనను హత్య చేసేందుకు కర్నూల్, కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్లు రెక్కీ నిర్వహించారని ఆరోపిస్తూ ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు, రియల్ ఎస్టేట్ ఆఫీసు పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుండటంతో ప్రశాంత్ రెడ్డికి అనుమానం వచ్చింది. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంత్ హత్యకు కుట్ర చేస్తున్నది ఎవరనేది తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.
బీజేపీలో కీలక పాత్ర..
ప్రశాంత్ రెడ్డి మహబూబ్‌నగర్ బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. గతంలో నాగర్ కర్నూల్‌లో విజయ సంకల్ప యాత్ర సభకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుతూ తనను తాను పరిచయం చేసుకున్నారు. నెక్ట్స్ జనరల్ ఎన్నికల్లో ప్రశాంత్ రెడ్డి దేవరకద్ర నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉంది. అయితే, గతంలో ప్రశాంత్ రెడ్డిపై ఓ హత్య కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించిన వ్యవహారంలోనే ఆయన్ను చంపేందుకు కుట్రలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అసలు విషయం ఏంటనేది పోలీసులే తేల్చా్ల్సి ఉంది.
Also Read:
మొదటి క్వార్టర్‌లోనే గోల్డ్ రేట్లు 25 శాతం జంప్..
టీచర్లకు విద్యార్థులు లంచం ఆఫర్.. ఎంతంటే..
For More Telangana News and Telugu News..