Share News

Hyderabad: లోన్‌ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

ABN , Publish Date - Jan 24 , 2025 | 11:11 AM

లోన్‌ యాప్‌ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని బాలానగర్‌ సీఐ టి.నర్సింహరాజు సూచించారు. లోన్‌ యాప్‌లో రుణాలు తీసుకొని వారి నుంచి వచ్చే వత్తిడితో డబ్బులు తిరిగి చెల్లించే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్న బాలానగర్‌ వినాయకనగర్‌(Vinayakanagar)కు చెందిన తరుణ్‌రెడ్డి ఘటనతో మేల్కొని ప్రజలు లోన్‌ యాప్‌లను ఆశ్రయించొద్దని హెచ్చరించారు.

Hyderabad: లోన్‌ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

హైదరాబాద్: లోన్‌ యాప్‌ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని బాలానగర్‌ సీఐ టి.నర్సింహరాజు(Balanagar CI T. Narasimha Raju) సూచించారు. లోన్‌ యాప్‌లో రుణాలు తీసుకొని వారి నుంచి వచ్చే వత్తిడితో డబ్బులు తిరిగి చెల్లించే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్న బాలానగర్‌ వినాయకనగర్‌కు చెందిన తరుణ్‌రెడ్డి ఘటనతో మేల్కొని ప్రజలు లోన్‌ యాప్‌లను ఆశ్రయించొద్దని హెచ్చరించారు. ప్రస్తుతంలో లెక్కకు మించిన కొన్ని సంస్థలు రుణాలు ఇస్తామ ని ఫోన్లు చేస్తూ ఆశచూపిస్తున్నారని, వారి ఉచ్చులో చిక్కుకున్నాక డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి పూర్తి డేటాను సంపాదించి రుణం ఇచ్చిన వారికి నరకం చూపిస్తున్నారని వివరించారు.

ఈ వార్తను కూడా చదవండి: MLA: వేలం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న హౌసింగ్‌ బోర్డు


ఫోన్లలో మనకు తెలియకుండా కొన్ని మెస్సేజ్‌లు, యాప్‌లు వస్తున్నాయని, వాటిని ఓపెన్‌ చేసిన మొత్తం డేటాను హ్యాక్‌ చేస్తున్నారని తెలిపారు. పిల్లలకు ఆండ్రాయిడ్‌ ఫోన్లు కొనిస్తే తప్పులేదు.. కానీ వారు ఏం చేస్తున్నారు.. ఫోన్‌లో ఏం చూస్తున్నారు.. సోషల్‌ మీడియాలో వచ్చే పోస్టింగ్‌లు, యాప్‌లపై తల్లీ తండ్రులు నిఘా పెట్టాలన్నారు. యాప్‌ల ద్వార డబ్బు పోయి న, హాకర్ల నుంచి లోన్‌ యాప్‌ నిర్వాహకుల నుంచి ఒత్తిళ్లు బెదిరింపులు వస్తే వెంటనే తమను ఆశ్రయించాలని సూచించారు.

city10.jpg


ఈవార్తను కూడా చదవండి: కిడ్నీ మార్పిడి జరిగిందెక్కడ?

ఈవార్తను కూడా చదవండి: నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?

ఈవార్తను కూడా చదవండి: భర్త దొంగ అని తెలిసి షాక్‌.. బిడ్డల్ని చంపి.. తల్లి ఉరి

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: దావోస్ ధమాకా!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 24 , 2025 | 11:35 AM