Share News

Bandi Sanjay: ఇందిరమ్మ పేరు పెడితే ఇళ్లివ్వం

ABN , Publish Date - Jan 26 , 2025 | 04:05 AM

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద కేంద్రం ఇచ్చే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వబోమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

Bandi Sanjay: ఇందిరమ్మ పేరు పెడితే ఇళ్లివ్వం

  • రేషన్‌ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పెట్టాలి

  • దావోస్‌లో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం ఇవ్వాలి

  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌

  • బీజేపీలో చేరిన కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద కేంద్రం ఇచ్చే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వబోమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంటే రేషన్‌కార్డులపై ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఇకపై కొత్త రేషన్‌కార్డులపై సీఎంతోపాటు ప్రధాని ఫొటో కూడా పెట్టాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అవసరమైతే కేంద్రమే నేరుగా పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పా రు. కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావుతో పాటు ఇద్దరు కార్పొరేటర్లు బీఆర్‌ఎ్‌సకు గుడ్‌బై చెప్పి శనివారం బండి సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. దావోస్‌ వేదికగా రూ.లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని చేస్తున్న ప్రచారమంతా ఉత్తదేనని కొట్టిపారేశారు.


రూ.ఐదు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రా బోతున్నాయని గత పదేళ్లలో అవగాహన ఒప్పందాలు చేసుకున్నారని, ఆచరణలో పదో వంతు కూడా రాలేదని విమర్శించారు. ‘2014 నుండి ఇప్పటి వ రకు దావోస్‌ పెట్టుబడులకు సంబంధించి ఎంత మొత్తంలో ఎంవోయూలు జరిగాయి? ఎంత మందికి ఉద్యోగాలిస్తామన్నారు? ఆచరణలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి..? ఎంత మందికి ఉద్యోగాలిచ్చారు..?’ శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ స్కామ్‌ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే దావోస్‌ పెట్టుబడుల పేరుతో ప్రచార దుకాణాన్ని తెరిచారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించ డం లేదని, పెండింగ్‌ బిల్లులు రాక మాజీ సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కేంద్రం నిధులతోనే పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కాగా, కరీంనగర్‌లో జరిగిన ప్రతి స్కామ్‌ వెనక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ హస్తముందని, అవినీతికి ఆయన కేరాఫ్‌ అని కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు ఆరోపించారు.


ఇవీ చదవండి:

క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్

రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 26 , 2025 | 04:05 AM