Bandaru Dattatreya: ఒకే కుటుంబంలో 18మంది మృతి బాధాకరం..
ABN , Publish Date - Nov 19 , 2025 | 08:28 AM
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యానగర్‌లోని నసీరుద్దీన్ కుటుంబ సభ్యులను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ ఆలీ తదితరులు పరామర్శించారు.
హైదరాబాద్: సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యానగర్‌లోని నసీరుద్దీన్ కుటుంబ సభ్యులను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Former Governor Bandaru Dattatreya), మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ ఆలీ తదితరులు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా నసీరుద్దీన్ చిన్న బావమరిది మహ్మద్ షాహీద్‌ను పలుకరించి ఓదార్చారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ ఒకే కుటుంబంలో 18 మంది చనిపోవడం బాధాకరమన్నారు.
నసీరుద్దీన్ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సౌదీలోని మదీనా మసీదులో వారి పేర్లపై అధికారికంగా ప్రార్థనలు జరిపి వారి ఆత్మకు శాంతి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తనవంతు కృషి చేస్తానన్నారు. మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ ఆలీ(Former Home Minister Mahmood Ali) మాట్లాడుతూ మృతదేహాలను గుర్తించేందుకు వారి బంధువులను వెంటనే సౌదీకి తీసుకెళ్లేలా,

రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా తనవంతు కృషి చేస్తానన్నారు. పార్టీ పరంగా బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆర్.శేషసాయి, అడిక్‌మెట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు పాశం సాయికృష్ణయాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు ముఠా జైసింహ, సయ్యద్ ఆస్లాం, కె.సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
సినిమాలకు.. ఇక సెలవు! నటనకు వీడ్కోలు.. పలికిన నటి తులసి
Read Latest Telangana News and National News