Share News

AV Ranganath: ఇల్లు కొంటున్నారా.. నాలాపై ఉందా చూడండి

ABN , Publish Date - Jun 17 , 2025 | 10:20 AM

ఇల్లు కొనుగోలు చేసే సమయంలో చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ తరహాలోనే నాలా ఆక్రమించి నిర్మాణం చేపట్టారా అన్నది కూడా చెక్‌ చేసుకోవాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పౌరులకు సూచించారు.

AV Ranganath: ఇల్లు కొంటున్నారా.. నాలాపై ఉందా చూడండి

- పౌరులకు ఏవీ రంగనాథ్‌ సూచన..

- ప్రజావాణిలో పలువురి ఫిర్యాదు

హైదరాబాద్‌ సిటీ: ఇల్లు కొనుగోలు చేసే సమయంలో చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ తరహాలోనే నాలా ఆక్రమించి నిర్మాణం చేపట్టారా అన్నది కూడా చెక్‌ చేసుకోవాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) పౌరులకు సూచించారు. బుద్ధభవన్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో 47 ఫిర్యాదులు వచ్చాయి. మల్కాజ్‌గిరి, బాచుపల్లి, సికింద్రాబాద్‌(Malkajgiri, Bachupally, Secunderabad)లోని పద్మారావునగర్‌, మాదాపూర్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారు నాలాల ఆక్రమణలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.


గ్రామ పంచాయతీ అనుమతితో లే అవుట్లు చేసి గతంలోనే విక్రయించిన స్థలాలకు వ్యవసాయ భూములంటూ తప్పుడు పాస్‌ పుస్తకాలతో కొందరు వ్యక్తులు కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ప్లాట్ల యజమానులు రంగనాథ్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన పాత లే అవుట్లలోని రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుతూనే అమాయకులు మోసపోకుండా చర్యలు తీసుకుంటున్నామని ఫిర్యాదుదారులకు భరోసానిచ్చారు.


ప్రజావాణికి దృష్టికి వచ్చిన కొన్ని ఫిర్యాదులు

- ఘట్‌కేసర్‌ మండలం పోచారం మునిసిపాలిటీ పరిధి కొర్రెముల గ్రామం సర్వే నంబర్‌ 739 నుంచి 749 వరకు ఉన్న 147 ఎకరాల్లో ఏకశిలానగర్‌ లే అవుట్‌ను 1985లో అభివృద్ధి చేశారు. 2006లో అందులోని 47 ఎకరాలను వ్యవసాయ భూమిగా చూపుతూ ఓ వ్యక్తి లే అవుట్‌ స్వరూపం మార్చారు. ఇదే లే అవుట్‌లో రెండు బడా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ప్రహరీలు నిర్మించి కొంత మేర కాజేశాయి.

- కొర్రెములలోని సర్వే నంబర్‌ 796లో 11.20 ఎకరాల భూమి ఉండగా, ఇందులో 7.20 ఎకరాల్లో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేశారు.

city6.2.jpg


- పంజాగుట్ట ఆఫీసర్స్‌ కాలనీలో 1000 చ.గ పార్కు స్థలంలో సగం జాగాలో దుర్గాభవానీ ఆలయం నిర్మించారు. మిగతా 500 గజాల స్థలం కబ్జాకాకుండా పార్కు అభివృద్ధి చేయాలి.

- అల్వాల్‌ మండలం జొన్నబండ గ్రామంలోని వజ్ర ఎన్‌క్లేవ్‌లో 900 చ.గల పార్కు స్థలం కబ్జా అవుతోంది.

- తూముకుంట మునిసిపాలిటీ దేవరయాంజల్‌ గ్రామంలోని తురకొని కుంట శిఖం భూమిలో వేయింగ్‌ మిషన్‌ ఏర్పాటు చేస్తున్నారని సీతారామచంద్ర స్వామి దేవస్థానం భూముల పరిరక్షణ సమితి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

గరిష్టానికి చేరుకుని, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

‘ధరణి’పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ షురూ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 17 , 2025 | 10:20 AM