High Court Advocate: ఐ బొమ్మ ఇమ్మడి రవి కేసు వాదిస్తా..
ABN , Publish Date - Nov 28 , 2025 | 06:37 AM
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసును తాను వాదిస్తానని ఏపీ హైకోర్టు న్యాయవాది పేటేటి రాజారావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... రవి చేసింది తప్పేనని.. కానీ తెలుగు ప్రజల మద్దతు అతనికి ఉందన్నారు.
- ఏపీ హైకోర్టు న్యాయవాది రాజారావు
హైదరాబాద్: ప్రజల పక్షాన న్యాయస్థానంలో వాదించి సినీమా ఫైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి(Immadi Ravi) కేసును గెలిపిస్తానని ఏపీ హైకోర్టు న్యాయవాది పేటేటి రాజారావు స్పష్టం చేశారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రవి చేసింది తప్పేనని. కానీ తెలుగు ప్రజల మద్దతు అతనికి ఉందన్నారు.

న్యాయస్థానంలో ఇమ్మడి రవి కేసు విషయంలో చట్టపరంగా బలమైన వాదనలు వినిపించి త్వరలో జైలు నుంచి బెయిల్‌పై విడుదల చేయిస్తానన్నారు. పోలీసులు పెట్టిన కేసులు బెయిలబుల్ సెక్షన్స్ అని అన్నారు. త్వరలో రవి తండ్రిని కలిసి ధైర్యం చెబుతానన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే
ముఖ్యమంత్రా.. రియల్ ఎస్టేట్ ఏజెంటా..?
Read Latest Telangana News and National News