Share News

MP R. Krishnaiah: కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలి..

ABN , Publish Date - Mar 07 , 2025 | 08:38 AM

ఈ నెల 26న ఢిల్లీ, అశోక రోడ్‌లోని తెలంగాణ భవన్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధూంధాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఎంపీ ఆర్‌. కృష్ణయ్య ఆవిష్కరించి మాట్లాడారు.

MP R. Krishnaiah: కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలి..

హైదరాబాద్: ఈ నెల 26న ఢిల్లీ, అశోక రోడ్‌లోని తెలంగాణ భవన్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధూంధాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఎంపీ ఆర్‌. కృష్ణయ్య(MP R. Krishnaiah) ఆవిష్కరించి మాట్లాడారు. కరెన్సీ నోట్లపై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలని, అందుకోసం పార్లమెంట్‌లో కొట్లాడతానన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: సింగర్ కల్పన హెల్త్ అప్‏డేట్ ఇదే..


city5.2.jpg

బహుజన కళాకారుడు డాక్టర్‌ ఏపూరి సోమన్న, కరెన్సీపై ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ జెర్రిపోతుల పరుశరామ్‌, సీఐపీఎస్ఎస్‌ జాతీయ సలహదారు ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 10 నుంచి జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. దూంధామ్‌ కార్యక్రమానికి 18 రాష్ట్రాల నుంచి కళాకారులు ఢిల్లీకి తరలివస్తున్నారని వారన్నారు.


ఈ వార్తను కూడా చదవండి: కొలంబియా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి

ఈ వార్తను కూడా చదవండి: Srisailam Dam: ముప్పు ముంగిట శ్రీశైలం!

ఈ వార్తను కూడా చదవండి: Transfers: భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్ ల బదిలీలు!?

ఈ వార్తను కూడా చదవండి: ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్‌ ఫోకస్‌

Read Latest Telangana News and National News

Updated Date - Mar 07 , 2025 | 11:03 AM