యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
ABN , Publish Date - Jan 19 , 2025 | 10:19 PM
యువత చదు వుతోపాటు క్రీడల్లో రాణించాలని మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని బీఆర్ అం బేద్కర్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న కాసిపేట మం డల ప్రీమియర్‌లీగ్ సీజన్ 3 పోటీలను ఆదివారం ప్రారం భించారు.

కాసిపేట, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): యువత చదు వుతోపాటు క్రీడల్లో రాణించాలని మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని బీఆర్ అం బేద్కర్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న కాసిపేట మం డల ప్రీమియర్‌లీగ్ సీజన్ 3 పోటీలను ఆదివారం ప్రారం భించారు. ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు.
క్రీడలతో శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసం ఉంటుందన్నారు. పోలీసు శాఖ క్రీడ లను ప్రోత్సహిస్తుందన్నారు. నేటి యువత మత్తు పదా ర్ధాలకు బానిసై విలువైన జీవితాలను కోల్పోతున్నారని ఇది సరైంది కాదన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులను అభినం దించారు. క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, ఫారెస్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్‌నాయక్, పది ఫ్రాంచైజెస్ యజమానులు, నిర్వాహ కులు మేరుగు శ్రీనివాస్, దాసరి శంకర్, నామసాని రాజు, తిరుపతి, క్రీడాకారులు పాల్గొన్నారు.