Share News

ఓరియంట్‌ ఎన్నికలపై వీడిన ఉత్కంఠ

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:13 PM

దేవాపూర్‌ ఓరియంట్‌ సిమెం ట్‌ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరప డింది. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ ఈశ్వర మ్మ ఎన్నికల ప్రక్రియపై వివరాలను వెల్లడించారు.

ఓరియంట్‌ ఎన్నికలపై వీడిన ఉత్కంఠ

కాసిపేట, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): దేవాపూర్‌ ఓరియంట్‌ సిమెం ట్‌ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరప డింది. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ ఈశ్వర మ్మ ఎన్నికల ప్రక్రియపై వివరాలను వెల్లడించారు. ఈ నెల 28న ఓట రు జాబితా ప్రదర్శనతోపాటు కార్మిక సంఘాలకు గుర్తుల కేటాయింపు, గేట్‌ మీటింగ్‌ల తేదీలను ప్రకటించనున్నట్లు తెలిపారు. 2024 ఆగస్టు 24లోపు కంపెనీలో పనిచేస్తున్న 265 మంది ఉద్యోగులు మాత్రమే ఓటు హక్కుకు అర్హులని తెలిపారు. ఓరియంట్‌ కంపెనీలో పది కార్మిక సంఘాలుం డగా ఐదు యూనియన్‌లు పోటీ చేసేందుకు అర్హత సాధిం చాయన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఓరియంట్‌లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలను ప్రారంభించారు. దీంతో కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ పర్మినెంటు వర్కర్స్‌, లోకల్‌ యూనియన్‌, కంపెనీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, తెలంగాణ ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ స్టాప్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌, ద లోకల్‌ ఓరియంట్‌ కంపెనీ ఎంప్లాయిమెంట్‌ వర్కర్స్‌యూనియన్‌ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సిమెంటు కంపెనీ అధికారులు ఉమాశంకర్‌రావు, సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 11:13 PM