Share News

క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

ABN , Publish Date - Jan 09 , 2025 | 11:24 PM

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీటవేస్తోందని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ అన్నారు. గురువారం సింగరేణి ఠాగూర్‌ స్టేడి యంలో అస్మిత ఖేలో ఇండియా అండర్‌ -13 ఉమెన్స్‌ పుట్‌బాల్‌ లీగ్‌ 2024-2025 టోర్నమెం ట్‌ను ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

రామకృష్ణాపూర్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీటవేస్తోందని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ అన్నారు. గురువారం సింగరేణి ఠాగూర్‌ స్టేడి యంలో అస్మిత ఖేలో ఇండియా అండర్‌ -13 ఉమెన్స్‌ పుట్‌బాల్‌ లీగ్‌ 2024-2025 టోర్నమెం ట్‌ను ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులను పోత్సహించేందుకు అవసర మయ్యే చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభు త్వంపై ఒత్తిడి తసుకువస్తానన్నారు. రామకృ ష్ణాపూర్‌లో క్రీడా పాఠశాలను తీసుకువచ్చేం దుకు కృషి చేస్తానన్నారు. ఖమ్మం, నిజమా బాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌ హకీంపేట్‌, ఆదిలాబాద్‌, పీకేఆర్‌ 11 సాకర్‌క్లబ్‌, గజ్వేల్‌ ప్రాంతాలకు చెందిన బాలికల జట్లు పోటీల్లో పాల్గొనగా క్రీడాకా రులచే ఎంపీ గౌరవ వందనం స్వీకరించి పోటీ లను ప్రారంభించారు.

13వ తేదీ వరకు పోటీ లు జరగనున్నాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు రూ.50వేలు, రూ.30వేలు, రూ.20 వేల నగదుతో పాటు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. మందమర్రి జీఏం దేవేందర్‌, తెలంగాణ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీ పాల్గున, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌, తహసీల్దార్‌ సతీష్‌, సింగరేణి పర్సనల్‌ మేనేజర్‌ శ్యామ్‌సుందర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జంగం కళ, వైస్‌చైర్మన్‌ సాగర్‌రెడ్డి, నాయకులు ఒడ్నా ల శ్రీనివాస్‌, పల్లే రాజు, రాజయ్య, అబ్దుల్‌ అజీ జ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, సమ్మయ్య, రామడుగు లక్ష్మణ్‌, అక్బర్‌, సుదర్శన్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 11:24 PM