ఉన్నత చదువులు చదివి ఉత్తమపౌరులుగా ఎదగాలి
ABN , Publish Date - Jan 06 , 2025 | 10:42 PM
గిరిజన గూడాల్లోని యువకులు ఉన్నత చదువులు చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని బెల్లంపల్లి ఏసీపీ రవికు మార్ అన్నారు. సోమవారం దేవాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాత తిర్మలాపూర్‌లో నిర్వహించిన పోలీ సులు మీ కోసంలో మాట్లాడారు. చదువు వల్ల సమా జంలో గౌరవం లభిస్తుందన్నారు. ప్రతీ ఒక్కరు చదువు కుని ఉన్నత ఉద్యోగాలు చేయాలని సూచించారు.

కాసిపేట, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): గిరిజన గూడాల్లోని యువకులు ఉన్నత చదువులు చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని బెల్లంపల్లి ఏసీపీ రవికు మార్ అన్నారు. సోమవారం దేవాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాత తిర్మలాపూర్‌లో నిర్వహించిన పోలీ సులు మీ కోసంలో మాట్లాడారు. చదువు వల్ల సమా జంలో గౌరవం లభిస్తుందన్నారు. ప్రతీ ఒక్కరు చదువు కుని ఉన్నత ఉద్యోగాలు చేయాలని సూచించారు. పోలీ సులు ఉన్నది ప్రజల భద్రత కోసమేనని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు. సంఘ విద్రోహ శక్తులకు సహకరిస్తే అభివృద్ధికి ఆటం కం ఏర్పడి ప్రజా సంక్షేమం దెబ్బతింటుందన్నారు. గ్రామాల్లో అనుమానస్పద వ్యక్తులు కనబడితే పోలీ సులకు సమాచారం అందించాలన్నారు. అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని సూచించారు. సమ స్యలు ఎదురైతే పోలీసులకు తెలియజేయాలన్నారు. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గిరిజన కుటుం బాలకు దుప్పట్లు, రగ్గులు, సరుకులు అందజేశారు. గిరిజన కుటుంబాలతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. మందమర్రి సీఐ శశిదర్‌రెడ్డి, దేవాపూర్ ఎస్‌ఐ ఆంజనేయులు, పోలీసులు, నాయకులు పాల్గొన్నారు.
ఉచిత కంటి ఆపరేషన్లు
వేమనపల్లి, (ఆంధ్రజ్యోతి): నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో పలు గ్రామాలకు చెందిన 25 మం దికి సోమవారం ఉచితంగా కంటి ఆపరేషన్‌లు చేయించినట్లు ఎస్‌ఐ శ్యామ్ పటేల్ తెలిపారు. ఇటీవల వేమనపల్లి ఆశ్రమ పాఠశాల ఆవ రణలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయగా ఇందులో కంటి సమస్యలతో బాధపడుతున్న 67 మందిని గుర్తించారు. ఇందులో 25 మందికి సోమవారం చెన్నూరులో కంటి ఆపరేషన్‌లు చేశారు. శంకర్ నేత్రాలయ వైద్యులతో ఆపరేషన్‌లు చేయించామని, కళ్లద్దాలు కూడా అందజేశామని ఎస్‌ఐ తెలిపారు.