Share News

పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు

ABN , Publish Date - Jan 18 , 2025 | 10:58 PM

చెన్నూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. శనివారం రాత్రి మున్సిపల్‌ కార్యాల యంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు

చెన్నూరు, జనవరి 18 (ఆంధ్ర జ్యోతి): చెన్నూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. శనివారం రాత్రి మున్సిపల్‌ కార్యాల యంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పట్టణం గతంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలే దన్నారు. పదేళ్ళ క్రితం తాను ఎంపీగా ఉన్న సమయంలో పట్టణం ఎలా ఉం డేదో ఇప్పుడు అలానే ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కాలనీలను సందర్శించి సమస్యలకు ప్రతిపాదనలను తయారు చేస్తున్నా నన్నారు. డీఎంఎఫ్‌టీ నిధులతో కాల నీల్లో అభివృద్ధి పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయన్నారు. పట్టణ అభివృద్ధికి మున్సిపల్‌ శాఖ చీఫ్‌ సెక్ర టరీతో మాట్లాడి ప్రత్యేక నిధుల మం జూరుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న వారికి రేషన్‌ కార్డు వస్తుందన్నారు. అర్హులైన వారందరికి రేషన్‌కార్డులు ఇప్పిస్తానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

నేడు సమీక్ష సమావేశం

మందమర్రి టౌన్‌, (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఆదివారం అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం జరగ నుంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి హాజరు కానున్నారు. ఇందులో అభివృద్ధి పను లపై చర్చించనున్నారు. అమృత్‌ స్కీం కింద మందమర్రి, క్యాతన్‌పల్లిలలో చేపట్టిన నీటి పథకం పనుల గురించి ఆరా తీయనున్నారు.

అలాగే మందమర్రిలో విద్యా వ్యాప్తికి కృషి చేసిన విద్యా విహార్‌ విద్యా సంస్థ నిర్వాహకుడు దివంగత షౌకత్‌ ఆలీ పేరిట రామన్‌ కాలనీ వద్ద లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి హాజరుకానున్నారు.

Updated Date - Jan 18 , 2025 | 10:58 PM