Share News

నాణ్యమైన భోజనం అందించాలి

ABN , Publish Date - Jan 09 , 2025 | 11:27 PM

విద్యార్థులకు నాణ్యమైన భోజ నం అందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థినుల విద్యా సామర్ధ్యాలను పరిశీలించి సమస్యలను తెలుసుకు న్నారు.

నాణ్యమైన భోజనం అందించాలి

తాండూర్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన భోజ నం అందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థినుల విద్యా సామర్ధ్యాలను పరిశీలించి సమస్యలను తెలుసుకు న్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యమైన భోజనం అందిం చాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. పనులను సత్వరమే పూర్తి చేయా లని ఆదేశించారు. రానున్న పబ్లిక్‌ పరీక్షల్లో వంద శాతం ఫలితాలు వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

విద్యార్థులకు స్వచ్ఛమైన తాగు నీరు, భోజనం అందించాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. తహసీల్దార్‌ ఇమ్రాన్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంఈవో మల్లేశం, డిప్యూటీ తహసీల్దార్‌ ప్రసాద్‌, ఆర్‌ఐ మహ్మద్‌ అజాదొద్దీన్‌, ప్రిన్సిపాల్‌ కవిత, ఉపాధ్యాయులు ఉన్నారు అనంతరం మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో తగిన సౌకర్యాలు లేనందున కలెక్టర్‌ మాదారం టౌన్‌షిప్‌లో ఉన్న సింగరేణి పాఠశాల భవనం, సీఐఎస్‌ఎఫ్‌ క్యాంపు భవనాన్ని పరిశీలించారు. సింగరేణి సీఎండీతో మాట్లాడి తాండూర్‌లో అద్దె భవనంలో కొనసాగుతున్న జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలను మాదారంలోకి మారుస్తా మని తెలిపారు. ఎస్‌ఐ సౌజన్య, తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 11:27 PM