Share News

నియోజకవర్గంలో వంద కోట్లతో అభివృద్ధి పనులు

ABN , Publish Date - Jan 04 , 2025 | 10:51 PM

చెన్నూరు నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వివేక్‌ వెంకట స్వామి అన్నారు. శనివారం ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేశారు.

నియోజకవర్గంలో వంద కోట్లతో అభివృద్ధి పనులు

చెన్నూరు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): చెన్నూరు నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వివేక్‌ వెంకట స్వామి అన్నారు. శనివారం ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభి వృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజలకు మంచినీటి సరఫరా కోసం చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలి టీల్లో వంద కోట్లతో అమృత్‌ పథకం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. చెన్నూరు మున్సిపాలిటీలో 80 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. చెన్నూరు ప్రభు త్వ ఆసుపత్రిలో సిబ్బందిని నియమించేందుకు మంత్రి దామోదర రాజనర్సింహాను కలిశామన్నారు. నియోజక వర్గంలో అక్రమ దందాలను అరికట్టానన్నారు. బావు రావుపేటలో రూ.1.4 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభి వృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తహసీల్దార్‌ మల్లికార్జున్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

జైపూర్‌, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రామా ల అభివృద్ధికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే వివేక్‌ వెంక టస్వామి పేర్కొన్నారు. ఇందారం, ముదిగుంట గ్రామా ల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. నియోజక వర్గంలోని ప్రతీ గ్రామంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. మండల కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

మందమర్రి టౌన్‌, (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పాల నలో రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని, అయినప్ప టికీ తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలన కుం భకోణాలకు నిలయంగా మారిందని, ఈ ఫార్ములా రేస్‌ అడ్వాన్స్‌గా చెల్లింపు జరిగిందనేది వాస్తవం కాదా అన్నారు. తప్పు చేయనప్పుడు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. చెన్నూరు నియోజకవర్గంలో వంద కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. తక్కువ టెండర్ల ద్వారా పనులు దక్కించుకున్న వారు నాణ్యతతో పనులు చేయకుంటే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదె లు, నాయకులు సుదర్శన్‌, ఉపేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

మాల మహానాడు నాయకులు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామిని కలిసి చేపట్టే కార్యక్రమాలను వివరిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మాలలంతా ఏకతాటిపై ఉండాలని, సంఘం పటిష్టత చాటాలని తెలిపారు. దాసరి రాములు, గజెల్లి లక్ష్మణ్‌, పైడిమల్ల నర్సింగ్‌ పాల్గొన్నారు. ఎమ్మెల్యే తేజ ల్యాబ్‌తో పాటు వివిధ సంస్థలకు చెందిన క్యాలెండర్లను ఆవిష్కరించారు.

భీమారం, (ఆంధ్రజ్యోతి): భీమారం మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. ఆవడం క్రాస్‌రోడ్డు వద్ద డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతోపాటు మండల అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి కృషి చేస్తానన్నారు. వర్షాకాలంలో కాలనీలోకి నీరు చేరుతుందని మహిళలు విన్నవిం చగా డ్రైనేజీ ఏర్పాటు చేసి నీరు రాకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు. భీమారం, మద్దికల్‌, కొత్తపల్లిలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ. 40 లక్షల వ్యయంతో పనులను ప్రారంభించినట్లు తెలిపారు. చేకుర్తి సత్యనారాయణరెడ్డి,మోహన్‌రెడ్డి, పోడేటి రవి, గద్దె రాంరెడ్డి, లక్ష్మణ్‌, భాస్కర్‌రెడ్డి, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 10:51 PM