Share News

Maoist Bharat Bandh: మావోయిస్ట్ పార్టీ.. నేడు భారత్ బంద్‌కు పిలుపు..

ABN , Publish Date - Oct 24 , 2025 | 08:06 AM

భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీలో మావోయిస్టులు కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో ఏజెన్సీలో కూడా హై అలెర్ట్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.

Maoist Bharat Bandh: మావోయిస్ట్ పార్టీ.. నేడు భారత్ బంద్‌కు పిలుపు..
Maoist Bharat Bandh

హైదరాబాద్: నేడు మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్‌‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. మావోయిస్ట్ పార్టీ బంద్ చేపట్టింది. దీంతో అప్రమత్తమైన అధికారులు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో హైఅలర్ట్ ప్రకటించారు. మల్లోజుల, తక్కెళ్లపల్లిపై మావోయిస్టులు ప్రతీకారంతో ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మావోయిస్టులు మెరుపు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో అధికారులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.


భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో ఏజెన్సీలో కూడా హై అలెర్ట్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. బంద్ ప్రకటన నేపథ్యంలో ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం, మంగపేట మండలాల్లో పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి రాష్ట్రంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Election Commission: సర్‌కు సన్నాహాలు చేయండి

Chennai: నాన్నే నేరస్తుడని నమ్మించేలా అమ్మను చంపేశాడు

Updated Date - Oct 24 , 2025 | 08:08 AM