Share News

మా భూములు మాకు ఇప్పించండి

ABN , Publish Date - Jan 09 , 2025 | 11:19 PM

మండల కేంద్రంలోని 138 సర్వే నెంబరులోని భూములను తమకు ఇప్పించాలని బాధితులు గురువారం తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. వారు మాట్లా డుతూ దొరలకు పాలేరుగా ఉండడంతో అందించిన భూమిని రెండేళ్ళ క్రితం వరకు సాగు చేసుకుని జీవిస్తుండగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభి వృద్ధి పేరిట తమ భూములను బలవంతంగా లాక్కుందన్నారు.

మా భూములు మాకు ఇప్పించండి

భీమారం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని 138 సర్వే నెంబరులోని భూములను తమకు ఇప్పించాలని బాధితులు గురువారం తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. వారు మాట్లా డుతూ దొరలకు పాలేరుగా ఉండడంతో అందించిన భూమిని రెండేళ్ళ క్రితం వరకు సాగు చేసుకుని జీవిస్తుండగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభి వృద్ధి పేరిట తమ భూములను బలవంతంగా లాక్కుందన్నారు.

ఈ విషయంలో పాలేరుల సంఘం రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టా మన్నారు. తమకు ఫైనల్‌ ప్రొసీడింగ్‌ పత్రాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే భూములను తిరిగి ఇస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. రాజం,మల్లయ్య, చంద్రయ్య, లచ్చయ్య, రాములు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 11:19 PM