మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలి
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:00 PM
పాలకవర్గం లేని మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని అఖిలపక్ష పార్టీల నాయకులు అందుగుల శ్రీనివాస్, కొంగల తిరుపతిరెడ్డి, రాయబారపు వెంకన్నలు తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ మున్సిపాలిటీకి ఎన్నికలు లేకపోవడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని, సంక్షేమం కుంటు పడుతుందన్నారు.

మందమర్రి టౌన్, జనవరి 18 (ఆంద్రజ్యోతి): పాలకవర్గం లేని మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని అఖిలపక్ష పార్టీల నాయకులు అందుగుల శ్రీనివాస్, కొంగల తిరుపతిరెడ్డి, రాయబారపు వెంకన్నలు తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ మున్సిపాలిటీకి ఎన్నికలు లేకపోవడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని, సంక్షేమం కుంటు పడుతుందన్నారు. 1950 చట్టం ప్రకారం అప్పటి సరిహద్దులు విలేజ్ రామకృష్ణాపూర్, ఊరు మందమర్రిని పక్కన పెట్టి ఎన్నికలు నిర్వహించవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఎన్నికలు లేకపోవడం వల్ల అధికారుల జవాబుదారితనం లోపించిందని అన్నారు. దశాబ్దన్నర కాలంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఎన్నికలే ఎజెండగా అఖిల పక్ష కార్యాచ రణ ఉంటుందని, సమావేశాలు ఏర్పాటు చేసి పరిస్థితిని వివరిం చనున్నట్లు తెలిపారు. నాయకులు మేడిపల్లి సంపత్, ఒ రాజశేఖర్, బండారి సూరిబాబు, మద్ది శంకర్, రాజశేఖర్, మాయ రమేష్, ముల్కల్ల ప్రసాద్, వెంకటేశ్వర్లు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.