బీఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధి
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:11 PM
బెల్లంపల్లి నియో జకవర్గం బీఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. తాము మం జూరు చేసిన నిధులతో పనులు చేస్తూ ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేసినట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నార న్నారు.

నెన్నెల, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): బెల్లంపల్లి నియో జకవర్గం బీఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. తాము మం జూరు చేసిన నిధులతో పనులు చేస్తూ ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేసినట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నార న్నారు. స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. 2023లో వివిధ పనుల కోసం రూ.30 కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులు మం జూరు చేసినట్టు చెప్పారు. నెన్నెల మండలంలోని కొత్తగూడెం, బొప్పారం, కోనంపేట రోడ్లు, ఎర్రవాగు బ్రిడ్జీ పనులకు 2023లోనే నిధులు మంజూరయ్యాయన్నారు. అవే పనులు కొనసాగుతున్నాయన్నారు. ధాన్యం కొను గోళ్లలో రైస్‌మిల్లర్లు రూ.వంద కోట్లు స్వాహా చేసినప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యం స్కాంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వినోద్ స్థానికంగా నివాసం ఉండకపోవడంతో మండ లానికో ఎమ్మెల్యే తయారయ్యాడని ఆరోపించారు. ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. పూర్తిగా రుణమాఫీ చేయకుండా, రైతు భరోసా ఇవ్వకుండా ప్రభుత్వం రైతు లను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ బెదిరింపులకు బీఆర్‌ఎస్ నాయ కులు భయపడరని, ప్రజల పక్షాన నిలబడి పోరాడతామన్నారు. మండల అధ్యక్షుడు సాగర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మేకల మల్లేష్, నాయకులు రాంచెందర్, ప్రతాప్‌రెడ్డి, ఎండీ ఇబ్రాహీం, తిరుపతి, కొయ్యడ శ్రీనివాస్ పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధి