Share News

సమష్టి కృషితోనే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యం

ABN , Publish Date - Jan 29 , 2025 | 11:45 PM

సమష్టి కృషితో నే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుందని అదనపు క లెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌ అన్నారు. వయోజన విద్యాశాఖ ఆద్వర్యంలో బుధవారం ముత్యంపల్లి రైతువే దికలో నిర్వహించిన ఒక్క రోజు శిక్షణ కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు.

సమష్టి కృషితోనే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యం

కాసిపేట, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): సమష్టి కృషితో నే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుందని అదనపు క లెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌ అన్నారు. వయోజన విద్యాశాఖ ఆద్వర్యంలో బుధవారం ముత్యంపల్లి రైతువే దికలో నిర్వహించిన ఒక్క రోజు శిక్షణ కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. కాసిపేట ఆదివాసీ మండలం కావడంతో అక్షరాస్యత శాతం తక్కువగా ఉందని, అందుకే ఆదివాసీ మహిళలకు చదువుపై ఆసక్తి పెంచి వంద శాతం అక్షరాస్యత సాధిం చే దిశగా కృషి చేయాలన్నారు. చదువుకున్న మహిళ ఇల్లు సామాజిక, ఆర్ధికరంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మార్చి 31లోగా సంపూర్ణ అక్షరాస్యత సాధించే విధంగా సిబ్బంది ప్రణాళికాబ ద్ధంగా కృషి చేయాలని ఆదేశించారు. సంపూర్ణ అక్షరా స్యత సాధించేందుకు దేవాపూర్‌ ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ ఆర్ధిక సహాయం అందించడం ఆనందంగా ఉందని, కంపెనీ యాజమాన్యాన్ని అబినందించారు. పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ, ఐకేపీ సిబ్బంది సంపూర్ణ అక్షరాస్యత కోసం భాగస్వాములు కావాలన్నా రు. మండలంలోని 22 గ్రామాల్లో ఉచిత వృత్తి విద్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. స్ధానిక మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం తెలంగాణ సంస్కృతి కళాకారులు అక్షరాస్యతపై ఆటపాటల ద్వారా వివరించా రు. అనంతరం కాసిపేట ఎంపీడీవోగా పనిచేసి బదిలీపై పెద్దపల్లి జిల్లా అంతర్గాం ఎంపీడీవో ఎంఏ అలీం గుండెపోటుతో మృతిచెందడంపై సంతాపం ప్రకటించి నివాళులర్పించారు.

కార్యక్రమంలో వయోజన విద్యా జిల్లా ప్రాజెక్టు అధికారి అజ్మీర పురుషోత్తం నాయక్‌, డీఆర్‌డీఏ పీడీ కిషన్‌, డీపీవో వెంకటేశ్వర్‌రావు, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు, సీడీపీవో స్వరూపరాణి, కాసిపేట తహసీల్దార్‌ బోజన్న, ఎంపీడీవో సత్యనారాయణసింగ్‌, క్వాలిటీ కో ఆర్డినేటర్‌ సత్యనారా యణమూర్తి, డీఆర్‌పీలు బండ శాంకరి, కొండు జనార్దన్‌, ఎర్ర సువర్ణ, సుమన్‌, కో ఆర్డినేటర్లు సంధ్య, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2025 | 11:45 PM