Home » Adilabad District
మంత్రి వర్గ విస్తరణలో చోటు కోసం చివరి దాకా పోటీ పడిన పలువురు ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సమావేశమయ్యారు.
బీఆర్‌ఎస్ నేత, ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్(డీసీసీబీ) చిక్యాల హరీశ్ కుమార్‌ను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
సమష్టి కృషితో నే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుందని అదనపు క లెక్టర్ సబావత్ మోతిలాల్ అన్నారు. వయోజన విద్యాశాఖ ఆద్వర్యంలో బుధవారం ముత్యంపల్లి రైతువే దికలో నిర్వహించిన ఒక్క రోజు శిక్షణ కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు.
Road Accidents: తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 75 మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని తొడసం వంశస్థుల ఆరాధ్య దైవమైన ఖాందేవుని జాతర ప్రతీఏడాది జనవరిలో సంక్రాంతి రోజున మొదలవుతుంది.
అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో పోలీసులపై దాడి ఘటన కలకలం రేపింది. గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ యువకుడు బాలికతో కలిసి ఉండగా స్థానికులు గదిలో బంధించారు.
బారెడు పొద్దెక్కినా ఇంకాసేపు ముసుగుతన్ని పడుకుంటే బాగుణ్ణు అనిపిస్తోంది! కప్పుకున్న దుప్పటి తీయబుద్ధేయడం లేదు.. మంచం దిగాలనిపించడం లేదు.. అంతా చలిపులి భయంతోనే! ఉదయం గడియారం తొమ్మిది గంటలు కొట్టినా..
కొమురం భీం జిల్లా: పులి జాడ కోసం కాగజ్ నగర్ అడవుల్లో అన్వేషణ కొనసాగుతోంది. ఇటిక్యాల్ పహాడ్ అటవీ ప్రాంతంలోనే పులి ఉందని అటవీ అధికారులు నిర్దారించారు. ట్రాప్ కెమెరాలు, డ్రోన్ ల ద్వారా సెర్చింగ్ చేస్తున్నారు. 10 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పులి ప్రభావిత గ్రామాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి.
కొమురం భీం జిల్లాలో పెద్దపులి టెన్షన్ కొనసాగుతోంది. రెండు రోజుల్లో పెద్దపులి ఇద్దరిపై దాడి చేసింది. పులి జాడ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇటిక్యాల్ పహాడ్ అటవీ ప్రాంతంలోనే పులి ఉందని అటవీ అధికారులు నిర్దారించారు. రైతులు, కార్మికులను పంట చేలకు, అటవీ మార్గాల్లోకి అధికారులు వెళ్ళ నీయడంలేదు.
పెద్దపులి కదలికల నేపథ్యంలో కొమురం భీం జిల్లా, కాగజ్‌నగర్, సర్పూర్ టీ మండలాల్లోని 15 గ్రామాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. అభరాణ్యంలో ఉండాల్సిన పులులు జనారణ్యంలో తిరుగుతున్నాయి. గ్రామల పొలిమేరలోకి వచ్చి వరుస దాడులు చేస్తూ.. మూగజీవాలు, మనుషులను హతమారుస్తున్నాయి. పులిదాడిలో వ్యవసాయ కూలీ మరణించగా రైతు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు కరువవుతోంది.