ఆదివాసీ గిరిజనులు మూఢనమ్మకాలను వీడాలి
ABN , Publish Date - Jan 16 , 2025 | 10:27 PM
ఆదివాసీ గిరిజనులు మూఢ నమ్మకాలను విడనాడాలని ఉట్నూరు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. గురువారం దేవాపూర్ పంచాయతీ పెద్దాపూర్‌కొలాంగూడలో నిర్వహించిన వైద్య శిబిరానికి ఆమె అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తు తం ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, అయినప్పటికీ కొందరు ఆదివాసీ గిరిజనులు నాటు వైద్యాన్ని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్నారు.

కాసిపేట, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ గిరిజనులు మూఢ నమ్మకాలను విడనాడాలని ఉట్నూరు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. గురువారం దేవాపూర్ పంచాయతీ పెద్దాపూర్‌కొలాంగూడలో నిర్వహించిన వైద్య శిబిరానికి ఆమె అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తు తం ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, అయినప్పటికీ కొందరు ఆదివాసీ గిరిజనులు నాటు వైద్యాన్ని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్నారు. ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలను అందిస్తుం దని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజన గూడాల్లో మెగా వైద్య శిబిరాలను నిర్వహిం చాలని సూచించారు.
గిరిజనులు గూడాల్లో అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పా టు, గట్రావుపల్లిలో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణం, రహదారి సౌకర్యాలను మెరుగుపర్చాలని పీవో దృష్టికి తీసుకువెళ్ళారు. ఆదివాసీ గిరిజనులు సంప్రదాయ వాయిద్యాలతో పీవోకు స్వాగతం పలికారు. కొమురంబీం జెండా గద్దె వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. 178 మందికి పరీక్షలు నిర్వహించి 35 మంది రక్తనమూనాలను సేకరించారు. డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్, ఐటీడీఏ అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ మనోహర్, డిప్యూ టీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్, ఆర్‌ఎంవో డాక్టర్ భీష్మ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవికిరణ్, మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.