Share News

Addanki Dayakar: దొంగచాటుగా కేటీఆర్‌ ఢిల్లీ టూర్లు: అద్దంకి

ABN , Publish Date - Aug 03 , 2025 | 04:39 AM

తెలంగాణ ప్రజల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఐదు వందల సార్లయినా ఢిల్లీ వెళ్లి వస్తారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు.

Addanki Dayakar: దొంగచాటుగా కేటీఆర్‌ ఢిల్లీ టూర్లు: అద్దంకి

హైదరాబాద్‌, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఐదు వందల సార్లయినా ఢిల్లీ వెళ్లి వస్తారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు. కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు దొంగచాటుగా ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్‌షా, సీఎం రమేశ్‌లను కలిసినట్లు రేవంత్‌రెడ్డి కలవట్లేదని స్పష్టం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలను మళ్లించుకున్న కేసీఆర్‌ కుటుంబానికి మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.


బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కోల్పోతున్నారని దయాకర్‌ అన్నారు. తెలంగాణ నీటి వాటాను తాకట్టు పెట్టిన బీఆర్‌ఎస్‌ నాయకులు బనకచర్లపై మాట్లాడటం విడ్డూరమని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బాలూనాయక్‌ అన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 04:39 AM