Share News

Sigachi Accident: సిగాచీ పేలుడులో 9 మంది గల్లంతు.. యాజమాన్యం ప్రకటన..

ABN , Publish Date - Jul 04 , 2025 | 07:00 PM

Sigachi Accident: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల విషయంలో ఇంకా సందిగ్ధత వీడటం లేదు. ఇప్పటివరకూ దాదాపు 40 మంది ఈ దుర్ఘటనలో దుర్మరణం పాలయ్యారు. కాగా, 9 మంది కార్మికుల మృతదేహాలు గల్లంతయినట్టుగా కంపెనీ యాజమాన్యం, జిల్లా కలెక్టర్ ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు.

Sigachi Accident: సిగాచీ పేలుడులో 9 మంది గల్లంతు.. యాజమాన్యం ప్రకటన..
Sigachi explosion Death Toll

హైదరాబాద్: పాశమైలారం సిగాచీ పరిశ్రమలో పేలుడు జరిగి 5 రోజులు గడుస్తున్నా మృతుల సంఖ్యపై సందిగ్ధత వీడటం లేదు. శిథిలాల తొలగింపు పూర్తికావొస్తున్నా.. గల్లంతైన వారి ఆచూకీ లభించకపోవడంతో బాధిత కార్మిక కుటుంబాల్లో రోదనలు మిన్నంటుతున్నాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 40 మంది ప్రాణాలు కోల్పోగా.. 9 మంది ఆచూకీ గల్లంతైనట్టుగా యాజమాన్యం ప్రకటించింది.


ఆశలు వదులుకోవాల్సిందేనా..

దుర్ఘటన జరిగిన ప్రాంతంలో శిథిలాల ఏరివేత దాదాపుగా పూర్తికావచ్చింది. అణువణువూ జల్లెడ పట్టినప్పటికీ 9 మంది కార్మికుల జాడ ఇంకా తెలియడం లేదు. ప్రమాదంలో గల్లంతైన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని తెలంగాణ రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ గుర్తించినట్లు సమాచారం. దీంతో బాధిత కుటుంబాల్లో ఆగ్రహావేశాలు మిన్నంటాయి. ఈ క్రమంలోనే ఐలా భవనంలో బాధిత కుటుంబాలతో సీఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ పరిస్థితి ఏంటని.. తమ వారిపై ఆశలు వదులుకోవాల్సిందేనా? అంటూ బాధిత కుటుంబ సభ్యులు సీఎస్ రామకృష్ణారావును నిలదీశారు. చాలామంది కాలిపోయినట్టుగా గుర్తించామని, కచ్చితంగా అందరికీ న్యాయం చేస్తామంటూ వారికి సీఎస్ హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం బాధిత కుటుంబీకులు కొందరు జిల్లా కలెక్టర్ కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డారు.


కాంట్రాక్టు కార్మికులపై నో క్లారిటీ..

గల్లంతైన కార్మికుల మృతదేహాల ఆచూకీ తెలియకపోవడంతో ప్రమాదంలో వారు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. లాకర్ రూంలో లభించిన సెల్ ఫోన్లు కాంట్రాక్టు కార్మికులవేనన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టు కార్మికుల గురించి యాజమాన్యం ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో మృతదేహాలు లభ్యం కాకపోతే బాధిత కుటుంబాలకు పరిహారం వచ్చే అవకాశం లేనట్టేనని తెలుస్తోంది. ఈ విషయమై సీఎస్ క్లారిటీ ఇవ్వకపోవడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. అంతేగాక, ఇప్పటివరకూ గల్లంతైన కార్మికుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది.


ఇవి కూడా చదవండి

స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలు

రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 04 , 2025 | 09:00 PM